twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్యన్ మహిళతో ‘పవర్ స్టార్’ రొమాన్స్.. ఏమాత్రం తగ్గని ఆర్జీవీ.. స్టిల్స్‌తోనే సెన్సేషన్

    |

    రామ్ గోపాల్ వర్మ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా షేర్ చేస్తున్న స్టిల్స్ గురించి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్, చిరంజీవిలను పోలి ఉండే వ్యక్తులను పెట్టి సినిమా చేస్తున్నాడు.. కానీ అవి వారికి సంబంధించినవి కాదని చెబుతాడు. సినిమా టైటిల్, పోస్టర్స్, ఆఖరికి టైటిల్ లోగోలోనో క్లియర్‌గా ఎన్నికల గుర్తు అయిన టీ గ్లాస్‌ను కూడా వాడేశాడు. అయితే వర్మ మాత్రం ఇప్పటికీ అది ఎవ్వరినీ ఉద్దేశించినది కాదనే బుకాయిస్తున్నాడు. తాజాగా వర్మ వదిలిన స్టిల్ మరో లెవెల్‌లో ఉందనకమానరు.

    పవర్ స్టార్ ప్రకటన..

    పవర్ స్టార్ ప్రకటన..

    వర్మ ఏది చేసినా ఓ సెన్సేషనే అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగ్నం తరువాత ఎలాంటి చిత్రాన్ని తెరకెక్కిస్తాడా? అని చూసిన వారికి పెద్ద షాకే ఇచ్చాడు. నేరుగా పవన్ కళ్యాణ్‌నే టార్గెట్ చేశాడు. అతడిని పోలి ఉండేలా ఓ టిక్ టాక్ స్టార్‌ను తీసుకొచ్చి పవర్ స్టార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

    ఎన్నికల తరువాత..

    ఎన్నికల తరువాత..

    ఇక రీసెంట్‌గా షూటింగ్ మొదలు పెట్టిన వర్మ.. వర్కింగ్ స్టిల్స్‌తో మతి పోగోడుతున్నాడు. ఎన్నికల ఫలితాల తరువాత జరిగిన కథ అంటూ వర్మ షేర్ చేసే స్టిల్స్ ఏ చిన్న పిల్లాడికి చూపెట్టినా చెబుతారు అవి పవన్ కళ్యాణ్‌వే అని. అయితే ఇందులోనూ వర్మ కాంట్రవర్సీలను వదలడం లేదు.

    డైరెక్టర్‌పై చేయిజేసుకున్నట్టు..

    డైరెక్టర్‌పై చేయిజేసుకున్నట్టు..

    వర్మ వదిలే పవర్ స్టార్ స్టిల్స్ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంటి వ్యవహారాలను టచ్ చేయడమే కాకుండా పుస్తకాలు, ఫాం హౌస్‌లు ఇలా ప్రతీ ఒక్క అంశాన్ని వర్మ చూపెట్టబోతోన్నాడు. వ్యవసాయం చేయడం, గడ్డి కోయడం వరకు బాగానే ఉన్నా.. ఓ డైరెక్టర్‌ను లాగి పెట్టి కొట్టినట్టు ఓ స్టిల్ వదిలాడు. అయితే అతను ఎవరన్నది మాత్రం చెప్పలేదు.

    రష్యన్ యువతితో..

    రష్యన్ యువతితో..

    తాజాగా వర్మ వదిలిన ఓ స్టిల్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. పవర్ స్టార్ రొమాంటిక్ యాంగిల్ అంటూ ఓ రష్యన్ యువతితో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇక ఈ పోస్టర్ మాత్రం అచ్చుగుద్దినట్టు ఉండటంతో వర్మ మామూలోడు కాదని కామెంట్స్ చేస్తున్నారు.

    శివకు సైకిల్ చైన్..

    శివకు సైకిల్ చైన్..

    శివ సినిమాలో సైకిల్ చైన్ ఎలానో పవర్ స్టార్ సినిమాలో గ్లాస్ అలా అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు వర్మ. మా సినిమాలో హీరోకు టీ తాగడం ఇష్టం అందుకే టైటిల్‌లోపెట్టామని ఎలాగైతే శివ సినిమాలో సైకిల్ చైన్ ఎలా వాడతాడో అలా అన్నమాట అని చెప్పుకొచ్చాడు.

    English summary
    Ram gopal varma powerstar Movie Romantic Stills. Putting the tea glass in the logo of POWER STAR is because the hero drinks tea often and it’s not for any political reasons ..In SHIVA logo I used Cycle chain because hero often hits with it ..THAT’S IT!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X