twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మొన్న మహేష్ బాబు.. నేడు రామ్ గోపాల్ వర్మ.. ఇదిగో వీడియో ప్రూఫ్

    |

    ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒకేఒక టాపిక్ కరోనా. ఊహించని విధంగా ఈ వైరస్ విజృంభిస్తుండటంతో జనం భయంతో జంకుతున్నారు. ఏకంగా 167 దేశాలు కరోనా ముప్పుతో విలవిలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వీడియో పోస్ట్ చేస్తూ తన సందేశమిచ్చారు. ఇంతకీ ఆ వీడియో ఏముంది? వివరాల్లోకి పోతే..

    కరోనా పట్ల జాగ్రత్తలు.. సెలబ్రిటీల సూచనలు

    కరోనా పట్ల జాగ్రత్తలు.. సెలబ్రిటీల సూచనలు

    కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అటు ప్రభుత్వం ఇటు సెలబ్రిటీలు పెద్దఎత్తున సూచనలిస్తున్నారు. పరిశుభ్రత పాటించాలని, జన సమూహం ఉండే ప్రదేశాలకు వెళ్లరాదని చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి సహా దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, యాంకర్ సుమ తదితరులు సూచనలిచ్చారు.

     సింపుల్‌గా మహేష్ బాబు..

    సింపుల్‌గా మహేష్ బాబు..

    కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. సామాజిక దూరం పాటిస్తూ.. జనం గుమిగూడకుండా ఉండటం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ విషయం ప్రతీ ఒక్కరికీ అర్థమయ్యేలా ఓ వీడియో ద్వారా చాలా సింపుల్‌గా చూపించారు మహేష్ బాబు.

    కరోనా వ్యాప్తి.. అందరికీ అర్ధమయ్యే వీడియో

    కరోనా వ్యాప్తి.. అందరికీ అర్ధమయ్యే వీడియో

    అగ్గిపుల్లలు వరుసగా పెట్టి నిప్పు అంటించగానే అది ఒకదాని వెంట మరొక దానికి అంటుకుంటూ వస్తోంది. ఆ మధ్యలో ఒక్క అగ్గిపుల్ల పక్కకు జరగడంతో మిగిలిన అగ్గిపుల్లల నడుమ దూరం పెరిగి ఆ మంట అంటుకోవడం అక్కడితో ఆగిపోయింది. ఈ వీడియో చూపిస్తూ ఇలాగే కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేయొచ్చని చెప్పారు మహేష్.

    Recommended Video

    Anchor Suma Tips To Stay Away From Corona Virus

    మొన్న మహేష్ బాబు.. నేడు రామ్ గోపాల్ వర్మ

    ఇప్పుడు అదే వీడియోను రామ్ గోపాల్ వర్మ కూడా షేర్ చేయడం విశేషం. ''సామాజిక దూరం పాటించడం వల్ల ఏం జరుగుతుందో చూడండి. ఇదిగో వీడియో ప్రూఫ్'' అంటూ ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు వర్మ. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ 'యూ ఆర్ టూ లేట్' వర్మ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    English summary
    In Telangana state all theaters and public places could remain closed through the end of March as the government works to contain the virus, Deadline reported. Now Ram Gopal Varma reacted on this issue with a video proof.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X