విశ్వక్ సేన్, దేవి నాగవల్లి వివాదంపై రామ్ గోపాల్ వర్మ రియాక్షన్.. పవర్ఫుల్ సర్కార్ అంటూ..

రీసెంట్ గా విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో ఓ తెలుగు మీడియా చానల్ లో తీవ్ర దుమారాన్ని రేపింది. విశ్వక్ న్యూసెన్స్ క్రియేట్ చేశాడు అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రాంక్ పై పలు కేసులు కూడా నమోదయ్యాయి. అయితే విశ్వక్ సేన్ న్యూస్ రీడర్ దేవి నాగవల్లితో చేసిన డిబేట్ మరింత వివాదంగా మారింది. అందులో నాగవల్లి, విశ్వక్ ఇద్దరు కూడా తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చేసుకోవడం సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఇక ఆ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.

ప్రాంక్ వీడియో కాంట్రవర్సీ

ప్రాంక్ వీడియో కాంట్రవర్సీ

యువ హీరో విశ్వక్ సేన్ తన కొత్త చిత్రం 'అశోక వనంలో అర్జున కల్యాణం' సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే సినిమా ప్రమోషన్లో భాగంగా విశ్వక్సేన్ చేసిన ఒక ఫ్రాంక్ వీడియో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డైరెక్ట్ గా పబ్లిక్ ప్లేస్ లో ఓ యువకుడి తో కలిసి చేసిన ఆ వీడియోపై నెటిజన్లు కూడా ఫైర్ అయ్యారు.

 యువకుడితో కలిసి

యువకుడితో కలిసి

అర్జున్ ని వెంటనే చూడాలి అంటూ అతను రాకపోతే సూసైడ్ చేసుకుంటాను అంటూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న అంటూ బెదిరించ సాగాడు. ఆ కుర్రాడిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినట్లుగా అక్కడ డ్రామా కొనసాగించారు. ఇక ఈ నెల ఆరవ తేదీన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రాబోతుంది అని అప్పుడు థియేటర్స్ లో చూడాలి అని విశ్వక్ అక్కడే మాటలతోనే సినిమాను ప్రమోట్ చేశాడు.

 దేవి నాగవల్లితో విశ్వక్ వాదనలు

దేవి నాగవల్లితో విశ్వక్ వాదనలు

ఇక ప్రాంక్ వీడియోపై కొన్ని మీడియా చానల్స్ లో డిబేట్స్ కూడా కొనసాగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఏమిటి అంటూ విశ్వక్సేన్ తీరుపై మండిపడ్డారు. ఇక దేవి నాగవల్లి కూడా మీడియా ఛానల్ లో అతని పై కొన్ని వ్యాఖ్యలు చేయడంతో అది కూడా వైరల్ గా మారింది. అయితే వెంటనే విశ్వక్సేన్ కూడా లైవ్ డిబేట్ లోనే ఆమెతో విభేదించడం మొదలుపెట్టాడు.

డిబేట్ లోనే గోడవలు

డిబేట్ లోనే గోడవలు

తనను పాగల్ సీన్ అన్నందుకు మీపై కూడా నేను కేసు పెట్టొచ్చు తెలుసా అంటూ విశ్వక్ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. అందుకు దేవి నాగవల్లి వెంటనే నా స్టూడియో నుంచి వెళ్లిపోవాలి అంటూ కౌంటర్ ఇచ్చింది. అంతేకాకుండా గెటవుట్ అంటూ మరింత గట్టిగా అరవడంతో విశ్వక్సేన్ కూడా కొంత సీరియస్ గా మాట్లాడారు. మీరు పిలిస్తే నేను ఇక్కడికి వచ్చాను అంటూ.. ఇక్కడ ఉండడానికి ఏమి రాలేదు అని అక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోయాడు.

 రామ్ గోపాల్ వర్మ రియాక్షన్

రామ్ గోపాల్ వర్మ రియాక్షన్

దేవి నాగవల్లి విశ్వక్ సేన్ కు సంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియో పై విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో స్పందించారు. స్త్రీ పురుషుడి కంటే శక్తివంతంగా కనిపించడం నేను ఎప్పుడూ చూడలేదని.. దేవి నగవల్లి సర్కార్ కంటే తక్కువ కాదు.. అని వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X