సెక్స్ అంటే పిచ్చి.. అదే లోకం: డైరెక్టర్ కూతురి వ్యాఖ్యలపై వర్మ షాకింగ్ రియాక్షన్
పోర్న్ ఇండస్ట్రీని షేక్ చేసిన సన్నీలియోన్ బాలీవుడ్‌లోకి అడుగు పెడితే.. దానికి పూర్తి విభిన్నంగా ఇప్పుడు పోర్న్ ఇండస్ట్రీలోకి హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు ఎంట్రీ ఇవ్వనుండటం హాట్ ఇష్యూగా మారింది. తాజాగా ఈ అంశంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ వివరాలు చూద్దామా..

పోర్న్ ఇండస్ట్రీలోకి వస్తున్నా.. సెక్స్ అంటే పిచ్చి
ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ దత్త పుత్రిక మికేలా (23) రీసెంట్‌గా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తాను పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. తనకి సెక్స్ అంటే పిచ్చి అని , అందులో నటించడంతో పాటు పోర్న్ వీడియోలు తీయడం కూడా ఇష్టమని చెప్పుకొచ్చింది.

కామంతో రగిలిపోతున్నా.. కంఫర్ట్‌గా ఫీల్ కాలేరు
అంతేకాదు తాను కామంతో రగిలిపోతున్నానే విధంగా కామెంట్స్ చేసింది. తన బాడీపైన విసుగు చెందిన ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.తానెప్పుడు శృంగార జీవితాన్ని ఇష్టపడతానని, అయితే అది గతంలో చాలా ఇబ్బందుల్లోకి నెట్టిపడేసిందని చెప్పింది. ఎందుకుంటే ఇక్కడి వారికి అలాంటి లైఫ్‌ను అంత కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ కాలేరు కదా! అని చెప్పింది.

నా శరీరం నా ఇష్టం.. అంటూ
ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడటానికి పోర్న్ రంగాన్ని ఎంచుకున్నట్లు తెలిపింది. తనకంటూ ఓ స్థాయి వచ్చాక.. ఇది తప్పేమీ కాదని తానే అందరికీ చెబుతానని పేర్కొంది. తాను కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేంత వరకు తన శరీరాన్ని తన ఇష్టమున్నట్టు వాడుకుంటానని చెప్పుకొచ్చింది.

తండ్రి సపోర్ట్.. కూతురు పోర్న్ ఇండస్ట్రీకి వెళుతుంటే!
తాను తీసుకున్న ఈ నిర్ణయంపై తన తండ్రి, దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ మద్దతుగా నిలిచినట్లు స్వయంగా మికేలా పేర్కొనడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఓ డైరెక్టర్ ఇలా కూతురు పోర్న్ ఇండస్ట్రీకి వెళుతుంటే చూస్తూ ఊరుకోవడమేంటని చర్చించుకుంటున్నారు జనం.
Recommended Video

ప్రపంచం ఇప్పుడిప్పుడే మారుతోంది
తాజాగా ఈ అంశంపై స్పందించిన రామ్ గోపాల్ వర్మ.. మికేలా సంచలన నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. అమెరికన్ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ తన కూతురు పోర్న్ కెరీర్‌ని ఎంచుకుందని తెలిసి సపోర్ట్ చేశారు. దీనిని బట్టి చూస్తుంటే ప్రపంచం ఇప్పుడిప్పుడే మారుతోందని వర్మ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











