twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంగోపాల్ వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ అందించిన కేఏ పాల్.. మామూలుగా వాడుకోలేదుగా.!

    By Manoj
    |

    తెలుగు రాష్ట్రాల్లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. సందర్భం ఏదైనా తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెబుతున్న ఆయన.. రాజకీయాలపైనా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా పట్టించుకోకుండా మరోసారి పొలిటికల్ సెటైరికల్ మూవీతో వస్తున్నారు. ఈ సినిమా ఆటంకాలు అన్నీ దాటుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో వర్మ.. ట్విట్టర్‌లో ఓ ఫొటోను ఫోస్ట్ చేశారు. ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో వెనుక రహస్యం ఏమిటి.? ఎందుకు ఈ ఫొటోను వర్మ పోస్ట్ చేశారు..?

    ఎందుకో వర్మ దృష్టి అటువైపు పడింది

    ఎందుకో వర్మ దృష్టి అటువైపు పడింది

    సాధారణంగా రాంగోపాల్ వర్మ సినిమాలు అంటే మాఫియా, ఫ్యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చేవి. కానీ, ఆయన కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. ఎందుకు ఆయన అటువైపు ఫోకస్ చేస్తున్నారో తెలియదు కానీ, సినిమాలు మాత్రం వాటి ఆధారంగానే తీస్తున్నారు. ఇటీవల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' తీసిన ఆయన.. ఇప్పుడు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'తో వస్తున్నారు.

     కేఏ పాల్ దెబ్బకు వర్మకు షాక్

    కేఏ పాల్ దెబ్బకు వర్మకు షాక్

    ఈ సినిమాలో ఓ పాత్ర కేఏ పాల్‌ను పోలి ఉండడంతో, దీనిని ఆపాలని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సినిమాను తాత్కాలికంగా నిలిపివేయాలని తీర్పునిచ్చింది. అంతేకాదు, ఈ సినిమా చూసి సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఆ తర్వాత కొన్ని పరిణామాల మధ్య ఈ సినిమా బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

    మామూలు హడావిడి కాదుగా

    మామూలు హడావిడి కాదుగా

    ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే టైటిల్‌తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా స్టార్ట్ చేసిన సమయంలో వివాదాస్పదం కాని సినిమా తీస్తున్నానని ప్రకటించాడు. కానీ, తర్వాత ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ వదిలిన సమయంలో పెద్ద రచ్చే జరిగింది. దీంతో ఈ సినిమా వివాదాస్పదం అయిపోయింది.

    వర్మ కెరీర్‌లో తొలిసారి ఇలా జరిగింది

    సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేమని రాంగోపాల్ వర్మ తేల్చి చెప్పారట. కానీ, టైటిల్‌తో పాటు కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగిస్తే నిర్ణయాన్ని మార్చుకుంటామని చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో వర్మ వాళ్ల ఆఫర్‌కు ఓకే చెప్పారట. ఇందులో భాగంగానే సినిమా సెన్సార్ పూర్తయిందని అంటున్నారు. వర్మ కెరీర్‌లో తొలిసారి ఇలా జరిగింది.

    Recommended Video

    CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
    సెన్సార్ సర్టిఫికెట్ అందించిన కేఏ పాల్

    సెన్సార్ సర్టిఫికెట్ అందించిన కేఏ పాల్

    ఈ సినిమా విషయంలో హాట్ టాపిక్ అయిన కేఏ పాల్‌ను ఉడికించాలనుకున్నారో ఏమో గాని, రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో ఓ ఫొటోను షేర్ చేశాడు. ఇందులో స్వయంగా కేఏ పాల్.. వర్మకు సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు ఎడిట్ చేశారు. వాస్తవానికి ఆ ఫొటోలో వర్మ స్థానంలో ఉన్నది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. దీన్ని ఇలా వాడుకున్నారు. దీంతో ఈ పిక్ వైరల్ అయిపోయింది.

    English summary
    The CBFC has also cleared the film with a U/A certificate on Saturday after the makers have agreed to change the film’s title from Kamma Rajyamlo Kadapa Reddlu to Amma Rajyamlo Kadapa Biddalu. The political satire, which was supposed to hit the screens on November 29, will now release on December 12.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X