బట్టలూడదీసి నగ్నంగా.. ట్రెండింగ్‌గా రాంగోపాల్ వర్మ వీడియో
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా...వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనున్నది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ సెన్సార్ ఇబ్బందులను అధిగమించి రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో ఆర్జీవి రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారనే విషయంలోకి వెళితే..
బాక్సింగ్ రింగ్‌లోకి దూకిన తర్వాత గట్టిగా గుద్దాలి అనేది నా ఫిలాసఫీ. కానీ జుట్టు పీకుతా.చెంప గిల్లుతా అనే యాటిట్యూడ్ ఉండకూదదు. అంటే ఇప్పుడు నేను యాత్ర 2 సినిమా గురించి మాట్లాడటం లేదు. వ్యూహం, శపథం సినిమాల్లో నిజాన్ని బట్టలిప్పి నగ్నంగా చూపించడమే నా కర్తవ్యం అని ఫిబ్రవరి 23వ తేదీన రాబోతున్న సినిమా గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా తన ఉద్దేశాన్ని వెల్లడించారు.

వ్యూహం సినిమాను జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు చూస్తారా? అని కొందరు నన్ను ప్రశ్నిస్తున్నారు. అయితే సికింద్రాబాద్‌లో లంబా థియేటర్‌లో శృంగార సినిమాలు, అడల్డ్, పోర్న్ సినిమాలు ప్రదర్శించే వారు. ఆ సినిమాలను కొందరు దొంగచాటుగా సినిమాలు చూసేవారు. తమకు నచ్చిన సినిమాలను ఆడియెన్స్ ఏదో రకంగా ఎవరి కంటపడకుండా చూసేవారు. ఆ విధంగా లంబా సినిమా ప్రజాసేవ చేసిందనే నా అభిప్రాయం అని రాంగోపాల్ వర్మ అన్నారు.
సినిమా పరిశ్రమలో అడల్ట్ జోనర్ ఎలాంటి సినిమాలు ఉన్నాయి? రిలీజ్ అవుతున్నాయనే గొప్ప ఇన్ఫర్మేషన్‌ను ఇవ్వడంలో సక్సెస్ అయ్యింది. అలాంటి సినిమాలను నన్ను ఎవరైనా చూస్తున్నారా? ఈ సినిమాకు వచ్చామని ఎవరైనా గుర్తించారా అనే భయంతో అలాంటి సినిమాలను లంబా థియేటర్‌లో చూసేవారు అని వర్మ వెల్లడించారు.
అదే విధంగా నేను ఉదయమే పోర్న్ చూస్తున్నట్టు.. జనసేన, టీడీపీ క్యాడర్ కూడా ఎవ్వరికి తెలియకుండా నేను బాత్రూమ్‌లో వీడియోలు చూసినట్టు.. వాళ్ల కూడా వ్యూహం సినిమాను దొంగచాటుగా చూస్తారనే నా ఉద్దేశం. కానీ మీరు అలాంటి భయం లేకుండా మీరు థియేటర్‌లో చూడండి.. టీడీపీ, జనసేన వాళ్లు మాత్రం బాత్రూంలో చూస్తారు అని వర్మ చెప్పారు.
దాసరి కిరణ్ నిర్మాణంలో రూపొందిన వ్యూహం సినిమా ఫిబ్రవరి 23న వస్తున్నది. శపథం సినిమా మార్చి 1వ తేదీన రిలీజ్ అవుతున్నది. మీకు ఇష్టం ఉంటే చూడండి... లేకపోతే మానేయండి అని ఆర్జీవి తాను రిలీజ్ చేసిన వీడియోలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











