దేవుడికి లేని కోపం మీకెందుకు? : రాజమౌళి వివాదంపై ఆర్జీవీ..

Rajamouli -RGV : దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబో తెరకెక్కుతున్న మూవీ వారణాసి. ఈ పాన్ వరల్డ్ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ.. తనకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేనని చెప్పిన వ్యాఖ్యలు భారీ దుమారం రేపుతున్నాయి. ఈ కామెంట్స్‌పై పలు హిందూ సంఘాలు, కొన్ని బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రాజమౌళిపై విషపూరిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదంపై తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఎక్స్ వేదికగా స్పందించారు. రాజమౌళి పక్షాన నిలిచి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆర్జీవీ ఏమన్నారంటే..?

ఆర్జీవీ తన పోస్ట్.. "రాజమౌళిపై విషం కక్కుతున్న సోకాల్డ్ ధర్మ రక్షకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే... భారతదేశంలో నాస్తికుడిగా (Atheist) ఉండటం నేరం కాదు. రాజమౌళికి కూడా హక్కు ఉంది' అని ఆర్జీవీ స్పష్టం చేశారు. "భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం దేవుడిని నమ్మడం ఎంత హక్కో, నమ్మకపోవడం కూడా అంతే హక్కు. కాబట్టి రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా అది నేరం కాదు" అని తెలిపారు. రాజమౌళి దేవుడిని నమ్మకపోతే సినిమాల్లో దేవుళ్లను ఎందుకు చూపిస్తారని కొంతమంది అడుగుతున్న ప్రశ్నను ఆయన గట్టిగా ధిక్కరించారు. "అలా అయితే గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే దర్శకుడు గ్యాంగ్‌స్టర్ అవ్వాలా? హారర్ సినిమా కోసం దెయ్యంగా మారాలా?" అంటూ విమర్శకులపై సెటైర్లు వేశారు.

Ram Gopal Varma Responds to Rajamouli Controversy

ఆర్జీవీ అంతటితో ఆగకుండా.. " నిజం చెప్పాలంటే... రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా దేవుడే ఆయనకు వంద రెట్లు విజయాలు, సంపద, అభిమానాన్ని ఇచ్చాడు. దేవుణ్ని నమ్మే చాలా మంది జీవితంలో చూడని స్థాయిని.. ఆయన నాస్తికుడైన పొందాడు" అంటూ దిమ్మతిరిగిపోయాలే చేశారు. దీనిని బట్టి చూస్తే నాస్తికులనే దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, లేదా దేవుడు అస‌లు జ‌నాల‌ను ప‌ట్టించుకోడేమో? లేదంటే దేవుడు తనని ఎవరు నమ్ముతున్నారని నోట్‌ప్యాడ్ పట్టుకొని లెక్కలు రాసుకుంటూ కూర్చోరో? అని ఆర్జీవీ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ అంతటీతో కూడా ఆగకుండా.. "రాజమౌళి దేవుణ్ని నమ్మకపోయినా సక్సెస్ అయ్యాడు... దేవుడికే సమస్య లేనప్పుడు, అదే స్వయం ప్రకటిత 'ధర్మ రక్షకుల' (God Mongers)ను ఎందుకు కోపం వస్తోంది " అని ప్రశ్నించారు. దేవుణ్ని ఎంత ప్రార్థించినా తమ జీవితంలో విజయాలు లభించకపోయిన కొందరికి ఈ విషయం సహించలేని అసూయగా మారిందని చెప్పారు. "ఇది భక్తి కాదు... అసూయకు ముసుగు వేసిన నాటకం" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

"దేవుడు బాగానే ఉన్నాడు... రాజమౌళి బాగానే ఉన్నాడు... బాధపడేది అసూయపడే కొందరే!. దేవునికి రాజమౌళితో సమస్య లేదు. రాజమౌళికీ దేవునితో సమస్య లేదు. కానీ ఈ ఇద్దరినీ అర్థం చేసుకోలేని కొందరికి మాత్రం బీపీ, అల్సర్లు తెచ్చుకుంటున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్జీవీ. రాజమౌళి చేస్తున్న 'వారణాసి' సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని, దేవుడే ఆయన బ్యాంక్ బ్యాలెన్స్‌కు మరో భారీ జాక్‌పాట్ జోడిస్తాడని ఆర్జీవీ వ్యంగ్యంగా పేర్కొన్నారు. 'అసూయపడే వారు ఏడుస్తూ కూర్చోవాల్సిన సమయం వస్తుంది ... జై హనుమాన్" అంటూ పోస్ట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X