అరెస్ట్ చేయడానికి వచ్చి.. పోలీసులు తాగి వెళ్లిపోయారు.. వర్మ సంచలనం
సినీ పరిశ్రమలో నిత్యం వివాదాల మధ్య, సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా ట్వీట్లు చేస్తూ ఉండే సినీ ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మ. గత ఏడాదిగా ఆయన అరెస్ట్ అవుతారనే వార్తలు మీడియాలో విస్తృతంగా చక్కర్లుకొట్టాయి. మీడియా ఊహించినట్టే.. సోషల్ మీడియాలో ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలపై కేసు పెట్టారు. అయితే తనపై కేసు గురించి వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనే చేసిన వ్యాఖ్యలు, ఆర్జీవీ తీసిన సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
రామ్ గోపాల్ వర్మ గత కొద్దికాలంగా సినీ ప్రపంచంలో పాపులారిటీ దారుణంగా కోల్పోయారు. అభిమానుల అంచనాలకు తగినట్టుగా సినిమాలు తీయకపోవడంతో ఆయన మూవీస్ అన్ని డిజాస్టర్లుగా మిగిలాయి. తన అభిమానుల అభిరుచిని ఆయన అందుకోలేకపోవడంతో నేటితరం ప్రేక్షకులకు ఆయన సినిమాలు దూరంగా ఉండిపోయాయి. దాంతో ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొడుతున్నాయి.

వరుస ఫ్లాపులను ఎదుర్కొంటున్న వర్మ తన పాపులారిటీని తిరిగి పొందేందుకు సారీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అ అమ్మాయి వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో ఆమెను వెతుకులాడి కేరళలో ఉన్న అందాల సుందరిని హీరోయిన్ చేశారు. ఆ సినిమానే శారీ. ఈ సినిమా ప్రమోషన్స్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
శారీ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పొల్గొంటున్న ఆయన కొన్ని కండిషన్లు ముందే మీడియాకు పెట్టడం విశేషంగా మారింది. ఏపీలో నమోదైన కేసులను, అలాగే ఏపీ సీఐడీ, పోలీసుల అరెస్ట్ వ్యవహారం, అలాగే ఏపీ పాలిటిక్స్ గురించి తనను ప్రశ్నించవద్దని వేడుకొంటున్నారు. అయితే జాతీయ మీడియా న్యూస్ 18 ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అరెస్ట్ గురించిన ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
ఏపీలో నాపై 7 కేసులు నమోదు అయ్యాయి. కానీ కోర్టును ఆశ్రయించడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. నాపై నమోదైన కేసులను అగ్రిగేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆ సమయంలోనే నా పోలీసులు నా ఆఫీస్‌కు వచ్చారు. ఆ సమయానికి కోర్టు నన్ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఆ విషయం పోలీసులకు తెలియకపోవడంతో నేను వారి దృష్టికి తీసుకొచ్చాను అని వర్మ తెలిపారు.
అయితే కోర్టు ఆదేశాలను చూపించిన తర్వాత వారికి ఏం చేయాలో తోచలేదు. నాతో ఆఫీస్‌లో కూర్చొని సరదాగా మాట్లాడారు. ఆ తర్వాత డ్రింక్ తాగి వారు వెళ్లిపోయారు. ఏపీ పోలీసులు నన్ను అరెస్ట్ చేయకుండానే వెళ్లిపోయారు. నేను సరదాగా ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టాలని ట్వీట్లు చేస్తుంటాను. అంతకంటే నాకు వేరే ప్రయోజనాలు లేవు అని వర్మ అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











