శృంగారం తర్వాత నా లవర్ అలా చేసేది.. అదే నాకు ఫుల్ కిక్.. రాంగోపాల్ వర్మ
శృంగారం, రొమాన్స్ విషయాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం తెలిసిందే. అయితే పలు సందర్బాల్లో ఆయన అమ్మాయిలతో కలిసి పార్టీలు చేసుకొంటూ రొమాంటిక్‌గా కనిపించడంతోపాటు.. ఆ పార్టీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రెండింగ్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే రాము ఇజం అనే సిరీస్ ఇంటర్వ్యూలో భాగంగా సెక్స్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
టెక్నాలజీ పెరిగినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. నటీ, నటుడు మధ్య రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు అమ్మాయిలు మూడ్‌ను బట్టి.. ఇష్టాన్ని బట్టి ఆ సీన్ చేయాలా? వద్దా అనేది ఆధారపడి ఉంటుంది. ఒక్కో మనిషికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అందర్నీ ఒకేలా చూడలేం. యాక్టర్ల మధ్య ఉండే వేవ్ లెంగ్త్ బట్టి ఆ సీన్ ఎలా పండుతుందనేది ఆధారపడి ఉంటుంది అని వర్మ చెప్పారు.

నాకు ఓ అమ్మాయితో అఫైర్ ఉండేది. నాతో శృంగారం చేసిన తర్వాత పక్కకు వెళ్లి బుక్ చదువుకొనేది. శారీరక సుఖం పొందిన తర్వాత ఆ మూడ్ నుంచి బయటపడటానికి పుస్తకం చదువుతుంది. శృంగారంలో ఆ పని అయిపోయిన తర్వాత.. దాని గురించి ఆలోచించకుండా మరో విషయంపై దృష్టిపెట్టడానికి ఆలోచించడం నాకు షాక్ కలిగించేంది అని వర్మ చెప్పారు.
నీతో నాకు పని అయిపోయింది అనే మూడ్‌లో ఆ అమ్మాయి కనిపించేది. సాధారణంగా ఇలాంటి అలవాటు మగవాళ్లలో ఉంటుంది. ఒక అమ్మాయి అలా చేయడం నాకు మంచి కిక్ ఇచ్చేది. శృంగారానికి ముందు చాలా మంది అబ్బాయిలు మాట్లాడుతారు. సెక్స్ తర్వాత అమ్మాయిలు మాట్లాడుతుంటారు. కానీ నాకు అఫైర్ ఉన్న అమ్మాయి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించేది అని వర్మ తెలిపారు.

శృంగారం తర్వాత అబ్బాయిలు నిద్ర పోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే శారీరక, మానసిక ఒత్తిడి వల్ల అలా జరుగుతుంది. అమ్మాయికి మాత్రం తన సుఖం దొరికింది కాబట్టి..దానిని పట్టించుకోదు. సీన్ షూట్ విషయంలో అమ్మాయిలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో అబ్బాయిల వ్యవహరించే మాదిరిగానే ఇప్పుడు అమ్మాయిలు చేస్తున్నారు అంటూ వర్మ తెలిపారు.


Click it and Unblock the Notifications











