ఆ హీరోయిన్‌‌ వెంటపడి అలా వేధించాను.. నిజాలు బయటపెట్టిన రామ్ గోపాల్ వర్మ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సమర్పణలో ఆర్జీవి ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత రవి వర్మ నిర్మించిన చిత్రం సారీ. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఆరాధ్య దేవీని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రూపొందిన ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు విభిన్నంగా ప్రారంభించారు. ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే..

సోషల్ మీడియాలోను, అలాగే ఓ అమ్మాయి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడి ఆమెను వెంటాడిన యువకుడి కథను సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందించారు. సైబర్ వేధింపుల కారణంగా ఓ యువతి జీవితం ఎలాంటి విపత్కర పరిస్థితులకు గురైందనే కథా నేపథ్యంగా రూపొందిందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

Ram Gopal Varma reveals Stalking moments with Sridevi in Aaradhya Devi s Saaree Promotions

ఎవరైనా ఎదుటి వారిని ఇష్టపడొచ్చు. కానీ అమ్మాయి గానీ, అబ్బాయి గానీ ఎదుటి వ్యక్తిని ఇష్టపడటంలో తప్పు లేదు కానీ.. ప్రేమకు ఓ హద్దు ఉంటుంది. ప్రేమించే ఫీలింగ్‌కు ఆ హద్దు దాటి ప్రవర్తిస్తే అది వేధింపుగా భావించవచ్చు. ఓ అమ్మాయికి అభిప్రాయాలకు విరుద్ధంగా రకరకాలుగా వేధించడం తప్పే అవుతుంది. అమ్మాయిని ప్రేమించడం.. ఆమె మనోభావాలకు విరుద్ధంగా వెంటాడటం చట్టపరంగా నేరం అవుతుందని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

సోషల్ మీడియాలో ఆరాధ్య దేవీ వీడియోలు, ఫోటోలు, రీల్స్ చూశాను. అప్పుడే ఆమెలో ఊహించని టాలెంట్‌ను గుర్తించాను. ఆరాధ్యను ముందుగా వెంటాడింది.. వేటాడింది నేనే. ఈ అమ్మాయిని వెతికి పట్టుకోవడానికి ఓ నలుగురిని నియమించాను. చివరకు అమ్మాయి కేరళకు చెందిన వ్యక్తిగా గుర్తించి.. ఆమెను కలిశాం. ఆ తర్వాత ఆరాధ్యకు సినిమా ఆఫర్ ఇచ్చామని రాంగోపాల్ వర్మ చెప్పారు.

Ram Gopal Varma reveals Stalking moments with Sridevi in Aaradhya Devi s Saaree Promotions

ఆరాధ్యదేవీకి యాక్టింగ్ పరంగా ఎలాంటి అనుభవం లేదు. కానీ నటించగలదని నేను బలంగా నమ్మాను. దాంతో శారీ సినిమాకు కథను నేనే రాశాను. నేను దర్శకత్వం చేయలేదు. నిర్మాతగా వ్యవహరించలేదు. కానీ కథ, స్క్రీన్ ప్లేతోపాటు ఈ సినిమాకు మెంటర్‌గా వ్యవహరించాను. నా అంచనాలను మంచి ఆరాధ్యదేవీ టాలెంట్ ప్రదర్శించింది అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.

అయితే అమ్మాయిల వెనుక వెంటపడటం (Stalking) విషయానికి వస్తే.. నా జీవితంలో నేను ఓ అమ్మాయి వెనుక వెంటపడ్డాను. నేను డైరెక్టర్ కాకముందు నాకు శ్రీదేవీ అంటే పిచ్చి. అన్నపూర్ణ స్టూడియో వద్ద సెట్లోను, ఆమె ఇంటి వద్ద శ్రీదేవీని వెంటపడే వాడిని. ఆ విషయం ఆమెకు తెలియదు కాబట్టి ఎలాంటి సమస్య రాలేదు. కానీ క్షణక్షణం సినిమాను ఆమెతో తీసి నా ప్రేమను ఆమెకు తెలిసేలా చేశాను అని రామ్‌గోపాల్ వర్మ చెప్పారు.

More from Filmibeat

Read more about: ram gopal varma sridevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X