అర్నబ్: ది న్యూస్ ప్రాస్టిట్యూట్ ఫస్ట్ లుక్.. ఆర్జీవి మరో సెన్సేషన్‌కు రెడీ
కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ స్తంభించిన నేపథ్యంలో వరుస సినిమాలతో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ హడలెత్తించడం చర్చనీయాంశమైంది. క్లైమాక్స్, నెకెడ్, పవర్ స్టార్ చిత్రాలను ఇప్పటికే రిలీజ్ చేయగా, థ్రిల్లర్, కరోనావైరస్, మర్డర్ లాంటి చిత్రాలతో సిద్ధంగా ఉన్నారు. అయితే బాలీవుడ్‌లో ఇటీవల కాలంలో హాట్ టాపిక్‌గా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని మీడియాలో విచారిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నబ్ గోస్వామిపై వర్మ గురిపెట్టారు.
అర్నబ్ గోస్వామి ప్రొఫెషనల్ జీవితంపై ఆర్జీవీ విమర్శనాస్త్రాన్ని సంధించే పనిలో పడ్డారు. తాజాగా అర్నబ్.. ది న్యూస్ ప్రాస్టిట్యూట్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బుధవారం రాత్రి 8.51 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అర్నబ్ ప్రతి రోజు రాత్రి 9 గంటలు ప్రారంభించే ప్రైమ్ టైమ్ షో ది నేషన్ వాంట్స్ టూ నో అనే ప్రోగ్రాం ఆరంభానికి 9 నిమిషాల ముందు రిలీజ్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు.

అర్నబ్.. ది న్యూస్ ప్రాస్టిట్యూట్ ఫస్ట్ లుక్‌ను జాతి మొత్తం తెలుసుకొనేలా ప్లాన్ చేశాననే విధంగా ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెటిజన్లలో, అభిమానుల్లో వ్యక్తమవుతున్నది.
ఇదిలా ఉండగా, యువతార అప్సర రాణితో రూపొందించిన థ్రిల్లర్ మూవీని ఆగస్టు 14వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్.కామ్, మరియు శ్రేయాస్ ఈటీ.కామ్ ఏటీటీ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా టికెట్ ఖరీదు రూ.200గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











