వర్మ మరో సెన్సేషన్: అర్నబ్: ది న్యూస్ ప్రాస్టిట్యూట్ మోషన్ పోస్టర్ రిలీజ్
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నబ్ గోస్వామి టార్గెట్ చేస్తూ రూపొందించిన అర్నబ్.. ది న్యూస్ ప్రాస్టిట్యూట్ మోషన్ పోస్టర్‌ను రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో రిలీజ్ చేశారు. అర్నబ్.. ది న్యూస్ ప్రాస్టిట్యూట్ ఫస్ట్ లుక్‌ను జాతి మొత్తం తెలుసుకొనేలా ప్లాన్ చేశాననే విధంగా ట్వీట్‌లో పేర్కొన్న వర్మ 9 గంటల ప్రాంతంలో మోషన్ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు పెట్టారు. అర్నబ్ ఫోటోను పోలీ ఉన్న మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్‌లో హూజ్ ద హెల్ ఆర్ యూ.. మై కంట్రీ అంటూ అస్పష్టంగా ఉన్న డైలాగ్స్ వినిపించాయి.
అర్నబ్ గోస్వామి ప్రొఫెషనల్ జీవితంపై ఆర్జీవీ విమర్శనాస్త్రాన్ని సంధిస్తూ అర్నబ్.. ది న్యూస్ ప్రాస్టిట్యూట్ అనే సినిమాను రూపొందిస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం ట్వీట్లు చేశారు. బాలీవుడ్ ప్రముఖులపై దాడి చేస్తున్న అర్నబ్‌పై సంచలనమైన కామెంట్లు చేశారు. అర్నబ్ ఎటాక్‌ను చూస్తూ ఊరుకోవద్దు.. మీరు కూడా మగాళ్లలా పోరాడండి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ స్తంభించిన నేపథ్యంలో వరుస సినిమాలతో దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన రేపుతున్నారు. క్లైమాక్స్, నెకెడ్, పవర్ స్టార్ చిత్రాలను విడుదల చేసి భారీగా కలెక్షన్లు అందుకొన్నారు. థ్రిల్లర్, కరోనావైరస్, మర్డర్ లాంటి చిత్రాలను త్వరలోనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇదిలా ఉండగా, యువతార అప్సర రాణితో రూపొందించిన థ్రిల్లర్ మూవీని ఆగస్టు 14వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్.కామ్, మరియు శ్రేయాస్ ఈటీ.కామ్ ఏటీటీ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా టికెట్ ఖరీదు రూ.200గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications











