ఆ సినిమాల ఎఫెక్ట్: వర్మకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.!
రాంగోపాల్ వర్మ.. తెలుగు వారితో పాటు దేశ వ్యాప్తంగా పరిచయం ఉన్న పేరిది. తనలోని నైపుణ్యంతో తెలుగు తెరపై సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు. అక్కినేని నాగార్జున నటించిన 'శివ' సినిమా ద్వారా పరిచయం అయిన ఈ స్టార్ డైరెక్టర్.. వెనువెంటనే బాలీవుడ్‌లోకీ అడుగు పెట్టేశాడు. ఈ క్రమంలో వరుసగా తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బడా డైరెక్టర్‌గా వెలుగొందాడు. క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్, హర్రర్, కామెడీ జోనర్లలో సినిమాలు చేసిన ఆయన.. కొన్నేళ్లుగా పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్ ఉన్న అంశాలను పట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే సంచలనం అవుతున్నాడు. తాజాగా ఈ దర్శకుడి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? వివరాల్లోకి వెళితే..

అన్నీ అవే తరహా సినిమాలు
ఈ మధ్య రాంగోపాల్ వర్మ సున్నితమైన అంశాలనే సినిమాలుగా తెరకెక్కిస్తున్నాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలపై ఆయన దృష్టి సారించాడు. ఈ క్రమంలోనే ‘రక్త చరిత్ర' రెండు భాగాలతో పాటు ‘వంగవీటి', ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇవన్నీ వివాదాస్పదం అయిన సినిమాలే.

సెక్స్ సినిమాతోనూ క్యాష్ చేసుకున్నాడు
కొద్ది రోజుల క్రితం వర్మ.. హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా అనుభవాలతో కూడిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీన్ని డైరెక్టుగా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ చేశాడు. అప్పట్లో ఈ మూవీ చేసిన హడావిడి మామూలుగా లేదు. చాలా అవాంతరాల నడుమ వచ్చిన ఈ సినిమా ద్వారా ఆర్జీవీ బాగానే లాభ పడ్డాడు.

మరో రెండు సినిమాలతో వస్తున్నాడు
రాంగోపాల్ వర్మ ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి ‘బ్యూటిఫుల్' కాగా.. మరో మూవీ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్'. వీటిలో మొదటి దానిని జనవరి 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీన్ని టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై అగస్త్య మంజు తెరకెక్కించాడు. ఇందులో సూరి హీరోగా, నైనా గంగూలీ హీరోయిన్‌గా నటించింది.

వర్మకు దారుణమైన పరిస్థితి
వాస్తవానికి ఆర్జీవీ సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ, ఆయన ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాలను అస్సలు పట్టించుకోవడమే లేదు. ముఖ్యంగా కొద్ది రోజుల్లో విడుదల కానున్న ‘బ్యూటిఫుల్' మూవీని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తాజాగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. దీంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.

ఈ సినిమాల వల్లే ఇలా జరుగుతోంది
రాంగోపాల్ వర్మ తెలుగు ప్రేక్షకుల్లో ఓ అంచనాను క్రియేట్ చేసుకున్నారు. ఆయన సినిమాలు అంటే ఎంతో వివాదాస్పదం అయ్యే అంశాలే ఉంటాయనుకునేలా చేశారు. కానీ, ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల్లో అలాంటివేమీ కనిపించడం లేదు. అయితే, ఈ రెండింటింలో రొమాన్స్ ఉన్నప్పటికీ.. ఈ మధ్య వస్తున్న అడల్ట్ సినిమాల వల్ల అంతగా అనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











