మరింత హాటుగా మియా మాల్కోవా.. క్లైమాక్స్ ట్రైలర్‌లో హాట్ డోస్ పెంచిన వర్మ!
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ అంటూ గత కొన్ని రోజులుగా కొత్తగా హడావుడి క్రియేట్ చేస్తున్న విషయం తెలిస్తే. ఇంటర్నేషనల్ శృంగార తార మియా మాల్కోవా తో రూపొందించిన క్లైమాక్స్ మూవీ ప్రమోషన్స్ డోస్ పెంచడానికి అర్జీవి రోజుకో ఆలోచనతో ముందుకు వస్తున్నాడు. ఇక ఫైనల్ గా సినిమా ట్రైలర్ ని కూడా వదిలి తనదైన శైలిలో హైప్ క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యాడు.

సెక్సీగా..
హాట్ నెస్ డోస్ పెంచడంలో అర్జీవి తరువాతే ఎవరైనా అనేలా మియా అందాలను తనదైన శైలిలో ప్రజెంట్ చేశాడు. ఎప్పుడు షూట్ చేశారో గాని ఎడారిలో మియా మాల్కోవా అందాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూస్తుంటే ఈ సినిమాతో కూడా వర్మ మంచి బజ్ క్రియేట్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది.

శృంగారంలో..
ఒక ఎడారిలోకి వచ్చిన ప్రేమ జంట అక్కడ శృంగారంలో మునిగి తేలుతుండగా అనుకోకుండా ఎదురైన సంఘటనలను ఎలా ఎదుర్కొన్నారు అనే విధంగా కథను రూపొందించినట్లు తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ తో పాటు మియా మాల్కోవా అందాలను వర్మ సరికొత్తగా చూపించడం స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు.

ట్రైలర్ అదిరింది..
శృంగార తార మియా మాల్కోవా అందం గురించి ఓ వర్గం కుర్రాళ్లకు తెలియనిది కాదు. అయినప్పటికీ ఆ స్టార్ బ్యూటీని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు అర్జీవి. ట్రైలర్ అదిరింది అనేలా కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన టీజర్స్ ఫస్ట్ లుక్ ని మిక్స్ చేసి కాస్త మసాలా కలిపినట్లు వర్మ చేసిన ప్రయోగం బాగానే ఉంది.
Recommended Video

అర్జీవి అనిపించుకున్నాడు..
గతంలో జిఎస్టీ సినిమాతో ఊహించని షాక్ ఇచ్చిన అర్జీవి ఆ తరువాత ఇలాంటి ప్రయోగలు చేయకూడదని అనుకుంటున్నట్లు టాక్ వచ్చింది. కానీ తాను ఎవరి మాట విననని మరో అడల్ట్ సినిమాతో చెప్పేశాడు. క్లైమాక్స్ లో చివరగా ఒక షాట్ వర్మలోని రొమాంటిక్ డోస్ ని చూపిస్తోంది. మరి ఈ సినిమాతో అర్జీవి ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











