ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గత కొద్దికాలంగా హారర్, థ్రిల్లర్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆర్జీవి ప్రస్తుతం దెయ్యం అనే మూవీతో సిద్దమయ్యారు. నట్టిస్ ఎంటర్‌టైన్‌మెంట్, పెగాసస్ సినీ కార్ప్ LLP పతాకాలపై ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవా, బెనర్జీ తదితరులు నటించారు.
జాన్వీ కపూర్ నెవర్ బిఫోర్ గ్లామర్ షో
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో దెయ్యం సినిమాకు జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం ఏప్రిల్ 16వ తేదీన తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ 5 భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ .. దెయ్యం మూవీ చాలా కాలం ఆగిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నేను, జీవిత గారు దెయ్యం సినిమా గురించి అనుకున్నప్పుడు రాజశేఖర్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు. అతడు కాల్షిట్స్ ఇచ్చే సమయంలో ముంబైలో నేను బిజీగా ఉన్నాను. ఇలాంటి కారణాలు సినిమా రిలీజ్‌కు ఆలస్యమైంది. ఈ చిత్రంలో రాజశేఖర్ కూతురు పాత్రలో స్వాతి దీక్షిత్ నటించింది అని అన్నారు.
కరోనా పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మా కుటుంబ తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నది. ఇక మా దెయ్యం మూవీకి రిలీజ్‌కు మార్గం సుగమమైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దెయ్యం సినిమా చూడాలని కోరుతున్నాను అని నిర్మాత జీవిత రాజశేఖర్ అన్నారు.

నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. దెయ్యం మూవీ కంటెంట్ చాలా బాగుంది. వర్మ స్థాయి ప్రమాణాలు ఇందులో ఉన్నాయి. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకొంటుంది. ఈ నెల 16వ తేదీన థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











