వైజాగ్ బీచ్‌లో ఆమె.. పది రోజుల పాటు అక్కడే.. ఫోటోతో పాటు విషయాన్ని బయటపెట్టిన వర్మ

ఎప్పుడూ సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే రామ్ గోపాల్ వర్మ.. సినిమాల పరంగానూ బిజీగానే ఉన్నారు. ఎవరేమనుకున్నా తనకు నచ్చింది కెమెరాలో బంధించేయడం వర్మ నైజం. ఈ నేపథ్యంలోనే తన తాజా సినిమా విశేషాలను తెలుపుతూ వైజాగ్ బీచ్‌ పేరెత్తారు. అంతేకాదు ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పారు. ఇంతకీ ఏంటా విషయం? వివరాల్లోకి పోతే..

 అప్పుడు పొలిటికల్ పంచ్.. ఇప్పుడు ట్రాక్ చేంజ్

అప్పుడు పొలిటికల్ పంచ్.. ఇప్పుడు ట్రాక్ చేంజ్

ఇటీవలే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' లాంటి పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలు తీసి సంచలనం సృష్టించిన వర్మ.. ఈ సారి ట్రాక్ చేంజ్ చేశారు. తొలిసారి ఓ అద్భుతమైన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ఎంటర్ ది డ్రాగన్' పేరుతో కొత్త సినిమా రూపొందిస్తున్నారు.

హీరోయిన్ పూజా భలేకర్‌.. భలే కిక్కిచ్చిందిలే

హీరోయిన్ పూజా భలేకర్‌.. భలే కిక్కిచ్చిందిలే

మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా భలేకర్‌ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పూర్తి మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైట్ సీక్వెన్స్ లతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ పూజా భలేకర్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ సినిమాపై ఆతృత కలిగించాయి.

విశాఖ బీచ్.. అక్కడే కానిచ్చేస్తున్న వర్మ

విశాఖ బీచ్.. అక్కడే కానిచ్చేస్తున్న వర్మ

అయితే కొన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన వర్మ.. తిరిగి ఈ 'ఎంటర్ ది డ్రాగన్'ను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఈ మేరకు షూటింగ్ లొకేషన్‌గా విశాఖ బీచ్ సెలెక్ట్ చేసుకొని అక్కడే హీరోయిన్‌తో షూట్ కానిచ్చేస్తున్నారు.

బికినీలో హీరోయిన్.. పరుగులు పెడుతూ

బికినీలో హీరోయిన్.. పరుగులు పెడుతూ

ఈ మేరకు షూటింగ్ లొకేషన్‌లో హీరోయిన్ పూజా భలేకర్‌ పరుగులు పెడుతున్న పిక్ షేర్ చేస్తూ విశాఖ బీచ్‌లో 'ఎంటర్ ది డ్రాగన్' షూటింగ్ జరుగుతోందని తెలిపారు వర్మ. బినికి వేసి ఆమె పరుగెడుతున్న తీరు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారింది.

బీచ్‌రోడ్డులో.. పది రోజుల పాటు అక్కడే

బీచ్‌రోడ్డులో.. పది రోజుల పాటు అక్కడే

బీచ్‌రోడ్డులోని కొబ్బరిచెట్లు నాటిన ప్రదేశంలో నూతన హీరో హీరోయిన్లు పూజ, పార్థ్‌లతో పాటు పలువురు జూనియర్‌ ఆర్టిస్టులపై కొన్ని లవ్‌ సీన్లను రామ్‌గోపాల్‌వర్మ తీశారు. ఇక్కడే మరో పది రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని తెలిసింది.

Recommended Video

RGV About Amma Rajyam Lo Kadapa Biddalu Movie || Filmibeat Telugu

అటు దిశ.. ఇటు ఎంటర్ ది డ్రాగన్

రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న ఈ 'ఎంటర్ ది డ్రాగన్' చిత్రాన్ని పలు భాషల్లో విడుదల చేయబోతున్నారు. తన సొంత బ్యానర్‌పై రామ్‌గోపాల్‌వర్మే దర్శక, నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ సినిమా తీస్తున్నారు. దీంతో పాటు 'దిశ' మూవీ కూడా చిత్రీకరిస్తున్నారు వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X