బాబు చంపేస్తాడు.. వివాదానికి తెరలేపిన వర్మ.. సెన్సేషనల్ కామెంట్స్

సంచలనాలకు మారు పేరు రామ్ గోపాల్ వర్మ. తరచూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వార్తల్లో ట్రెండింగ్ కావడం ఈ డైరెక్టర్‌కి వెన్నతో పెట్టిన విద్య. కొంత కాలంగా వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఈయన.. సినిమాలు తీయడంలోనూ, సోషల్ ఇష్యూలపై స్పందించడంలోనూ కాస్త భిన్నంగా దూసుకుపోతున్నారు. గతంలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన వర్మ.. ఇప్పుడు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ మరో సంచలనానికి రెడీ అయ్యారు.

వరుస అప్‌డేట్స్.. టార్గెట్ ఆయనే

వరుస అప్‌డేట్స్.. టార్గెట్ ఆయనే

వాస్తవానికి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వలేదు. ఊహించని విధంగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా అప్డేట్స్ ఇస్తూ సరికొత్త సంచలనాలకు బాటలు వేస్తున్నారు వర్మ. ప్రతీ అప్‌డేట్ లోనూ ఆయన టార్గెట్ ఎవరనేది స్పష్టంగా అర్థమవుతోంది జనాలకు.

 కమ్మరాజ్యంలో కడపరెడ్లు సాంగ్స్

కమ్మరాజ్యంలో కడపరెడ్లు సాంగ్స్

క్యాస్ట్ ఫీలింగ్ నేపథ్యంలో సాంగ్ విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా 'బాబు చంపేస్తాడు' అనే సాంగ్ విడుదల చేసి మరో బాంబ్ వేశారు. దయచేసి ఈ పాట విని ఆనందించకండి... ఆలోచించండి అంటూ ముందుగానే ప్రకటించిన వర్మ అన్నంత పని చేసేశారు. తాజాగా విడుదలైన 'బాబు చంపేస్తాడు' ఆలోచింప జేసేలానే ఉంది.

టార్గెట్ చేసి ఆయన గురించే పూర్తిగా

టార్గెట్ చేసి ఆయన గురించే పూర్తిగా

'బాబు చంపేస్తాడు' అనే ఈ సాంగ్ వీడియోలో జగన్, చంద్రబాబు, విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు, నారా లోకేష్ లాటి ప్రముఖ రాజకీయ నాయకుల దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాంగ్ అంతా కూడా ఒక్కరినే టార్గెట్ చేసి ఆయన గురించి పూర్తిగా వివరించారు వర్మ. ఈ సాంగ్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సెన్సేషనల్ కామెంట్స్.. తనదైన స్టైల్ సెటైర్

సంచలనాలకు తెరలేపేలా ఈ సాంగ్ విడుదల చేసిన వర్మ.. సోషల్ మీడియాలో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా, అందులోని పాత్రలు పూర్తిగా కల్పితమని పేర్కొంటూ.. ఈ చిత్రంలో పాత్రలు నిజజీవితంలో ఎవరినైనా పోలి ఉన్నాయని అనిపిస్తే నాకు సంబంధం లేదంటూ
తనదైన స్టైల్ సెటైర్ వేశారు వర్మ.

కథ ఇదేనంటూ ప్రకటన

కథ ఇదేనంటూ ప్రకటన

రెండు కులాలను ఆధారంగా తీసుకుని వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. ఈ రెండు కులాలను వాడకున్నప్పటికీ వివాదాస్పదం కాని సినిమానే చేస్తానని గతంలోనే చెప్పాడు వర్మ. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆయన వివరించారు.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు

తాజాగా విడుదలవుతున్న అప్‌డేట్స్ చూస్తుంటే.. వర్మ తెరకెక్కిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది. అదును చూసి ఆయన ఇస్తున్న అప్‌డేట్స్ రాజకీయ నాయకుల గుండెల్లో పరుగులు పెట్టించేలా ఉండటంతో ఈ సినిమాపై సినీ, రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X