కమ్మరాజ్యంలో కడప రెడ్లు: ఇదీ అప్‌డేట్ అంటున్న రామ్ గోపాల్ వర్మ
ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సంచలనం సృష్టించిన వర్మ.. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో డిఫెరెంట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టించాయి. దీంతో ఈ సినిమా విడుదలపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేయడం జరిగింది.
నిజానికి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా నవంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిఉంది. కానీ సెన్సార్ బోర్డు పర్మిషన్ రాకపోవడంతో ఈ సినిమాను వాయిదా వేశాడు వర్మ. ఈ నేపథ్యంలో సినిమా పేరును కూడా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా పేరును 'అమ్మరాజ్యంలో కడప బిడ్డలు'గా మార్చుతున్నట్లు తెలిపాడు.

కాగా తాజాగా ఈ సినిమా అప్‌డేట్ ఇదీ అంటూ ట్వీట్ చేశాడు వర్మ. శనివారం ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ వీక్షించిందని, చిత్రంలో అవసరమైన మార్పుల్ని సూచించాలని కోరుతూ కేంద్ర రివైజింగ్ కమిటీకి సిఫార్స్ చేసిందని పేర్కొంటూ ట్విట్టర్ ద్వారా తాజా అప్‌డేట్ తెలియజేశారు రామ్‌గోపాల్‌వర్మ.
రివైజింగ్ కమిటీ తీసుకునే నిర్ణయం అనంతరమే ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా వర్మ టార్గెట్ చేసిన రాజకీయ పార్టీ ఏంటి? అనేదానిపై జనాల్లో చర్చలు ముదురుతున్నాయి. చూడాలి మరి చివరకు సినిమాలో ఏం చుపిస్తారనేది.


Click it and Unblock the Notifications











