Konda Biopic కొండా మురళి దేహంలో బుల్లెట్లు.. వాటి వెనుక కథే కొండా సినిమా.. ట్రైలర్ ఎప్పుడంటే?

వరంగల్ జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించిన రాజకీయ దంపతులు కొండా సురేఖ, మురళీధర్. దశాబ్దకాలంపాటు ఈ రాజకీయ దంపతులు తిరుగులేని అధిపత్యాన్ని కొనసాగించారు. వారి రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు, అపజయాలు ఉన్నాయి. వారి రాజకీయ జీవితం వెనుక ఎన్నో భావోద్వేగాలు దాగి ఉన్నాయి. బయటి ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటన్నింటిని వెండి తెర మీద ఆవిష్కరించేందుకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ చేస్తున్న ప్రయత్నమే కొండా చిత్రం. ఈ చిత్రాన్ని అక్టోబర్ 12వ తేదీన కొండా మురళి స్వగ్రామం వంచనగిరిలో కొండా మూవీ ప్రారంభమైంది. షూటింగ్ ముగించుకొని రిలీజ్‌కు సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

కార్ల్ మార్క్స్ చెప్పినట్టు విప్లవమనేది తుపాకీ తూటల్లో నుంచి కాదు, కొండా మురళి చెప్పినట్టు గుండెల్లోతుల్లోని బాధల నుంచి పుడుతుంది. అందుకే మనిషిని అనగదొక్కే పరిస్థితి ఉన్నంత వరకు, విప్లవం అనే ఒక దైవసర్పం కాటేస్తూనే ఉంటుంది. పెత్తందారులకి ఎదురు పోరాడిన ఆ కొండా దంపతుల కథలు బెజవాడ దుర్గమ్మ, అనంతపురం సుంకాలమ్మని మించిన మైసమ్మ శాల్తులుగా నాకు అనిపించ బట్టే మీకు కనిపించ చెయ్యబోతున్నాను అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

Ram Gopal Varmas Konda Movie trailer to release on republic day

కొండా దంపతుల జీవితంలో ఈ నిజాలన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయి . కొండా చిత్రం మొదటి ట్రైలర్ జనవరి 26th, రిపబ్లిక్ డే రోజు ఉదయం 10గంటల 25 నిముషాలకి విడుదల కాబోతుంది. ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే, యెన్నో సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26th, రిపబ్లిక్ డే రోజున అదే 10గంటల 25 నిముషాలకి కొండా మురళి పైన వంచనగిరిలో, ఒక్క అత్యంత దారుణ హత్య ప్రయత్నం జరిగింది. మైసమ్మ దయ వల్ల కొండా బ్రతికి పోయినప్పటికి, ఆ దాడికి సంబందించిన కొన్ని బుల్లెట్ లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండి పోయాయి. ఆ బుల్లెట్లకి ముందు కథ, వాటి తర్వాత కథే, మా కొండా కథ అని ఆర్జీవి తెలిపారు.

Ram Gopal Varmas Konda Movie trailer to release on republic day

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X