నారా లోకేష్‌కి పవన్ ఓదార్పు.. ఫోటో షేర్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం అని ప్రత్యేకంగా చెప్పాలా..! ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో షాకివ్వడం కామన్‌గా జరిగే సంఘటనే. ఈ బాటలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మాజీ సీఎం కుమారుడు, టీడీపీ నేత నారా లోకేష్‌ని ఓదార్చుతున్న ఓ పిక్ షేర్ చేసి సంచలనం సృష్టించాడు. వివరాల్లోకి పోతే..

ఊహించని విధంగా అప్‌డేట్స్.. చుక్కలు చూపిస్తూ!

ఊహించని విధంగా అప్‌డేట్స్.. చుక్కలు చూపిస్తూ!

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. నిజానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా ఈ సినిమా అప్‌డేట్స్ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నాడు వర్మ.

ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. అందరూ

ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. అందరూ

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను తెరపైకి తీసుకొస్తూ సంచలనాలకు బాట వేసిన వర్మ.. ఈ సినిమాలో నటించే నటీనటుల విషయమై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని స్పష్టంగా తెలుస్తోంది. రాజకీయ నేపథ్యమున్న సినిమా కావడంతో చంద్రబాబు, వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కెఏ పాల్ ఇలా అన్ని క్యారెక్టర్లకు అచ్చు గుద్దినట్లు వారి లాగే ఉండే నటులను ఎంపిక చేశాడు వర్మ.

సరికొత్త చర్చలకు తెరలేపేలా.. ఏదైనా సాధ్యమే అంటూ

సరికొత్త చర్చలకు తెరలేపేలా.. ఏదైనా సాధ్యమే అంటూ

ఇప్పటికే ఈ నటీనటులు, వారి వారి క్యారెక్టర్స్ రివీల్ చేస్తూ పోస్టర్స్ రిలీజ్ చేసిన వర్మ.. తాజాగా మరో సెన్సేషన్ల పిక్ పోస్ట్ చేసి సరికొత్త చర్చలకు తెరలేపాడు. నారా లోకేష్‌ని పవన్ కళ్యాణ్ ఓదార్చుతున్నట్లుగా ఓ పిక్ షేర్ చేస్తూ.. 'రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే' అని ట్యాగ్ చేశాడు.

టీడీపీ, వైసీపీ, జనసేన వర్గాల్లో కుదుపు

రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన ఈ పిక్.. టీడీపీ, వైసీపీ, జనసేన వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ మూడు పార్టీలకు ఓ కుదుపు కుదిపేసేలా వర్మ ఈ పిక్ షేర్ చేశాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎలాంటి కాంట్రవర్సీ లేదంటూనే వర్మ ఇస్తున్న అప్‌డేట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు హంగామా

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు హంగామా

ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై హైప్ నెలకొంది. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై పోలీస్ కేసు కూడా నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X