బాహుబలి లెవల్ బెగ్గింగ్.. పవన్ ఎప్పటికీ ఒకరిని అడుక్కోరు.. చిరంజీవిని ఉద్దేశిస్తూ వర్మ సంచాలనం!
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రతినిధుల బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ భేటీ మీద రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖలు చేశారు. అలాగే ఆయన చేసిన ఒక ట్వీట్ డిలీట్ కూడా చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
Recommended Video

చిరంజీవి మీద కామెంట్స్
వకీల్ సాబ్ సమయంలో తగ్గించిన ఏపీ సినిమా టికెట్స్ రేట్స్ గురించి టాలీవుడ్ అంతా టెన్షన్ లో ఉంది. ఆ మధ్యలో మధ్యలో రామ్ గోపాల్ వర్మ ఎంటరై ఈ ఇష్యూపై పలు కామెంట్స్ చేశారు. సినిమా టికెట్స్ రేట్లు నిర్ణయించడంలో ప్రభుత్వ జోక్యం ఎందుకుని విరుచుకుపడడమే కాక ఆంధ్ర ప్రదేశ్ వెళ్లి ప్రభుత్వంతో భేటీ కూడా అయి వచ్చారు. ఆ తరువాత సైలెంట్ గా ఉండిపోయిన ఆయన తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయిన చిరంజీవి బృందం మీద కామెంట్స్ చేశారు.

10 రోజుల్లో జీవో
జగన్ తో జరిగిన భేటీలో ఏపీలో అన్ని సినిమాలకు 5 షోలకు అనుమతి లభించింది. టికెట్ రేట్ల పెంపు మీద ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ సినిమా సమస్యలకు అయితే ఇక శుభ కార్డు పడిందని, మరో వారం, 10 రోజుల్లో జీవో వచ్చే అవకాశం ఉందని అందరూ వెల్లడించారు. అయితే ఎప్పుడూ మాట్లాడని మహేష్ బాబు, ప్రభాస్ లు సైతం అంతా సెట్ అంటూ కామెంట్స్ చేశారు.

ట్వీట్ డిలీట్
అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. "సర్ చిరంజీవి గారు, నేను మెగా అభిమానిగా మీ మెగా బెగ్గింగ్‌తో మెగా హర్ట్ అయ్యాను" అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈ ట్వీట్ తో పాటుగా వైఎస్ జగన్‌తో టాలీవుడ్ ప్రముఖుల బృందం సమావేశానికి సంబంధించిన వీడియో లింక్‌ను కూడా పంచుకున్నాడు. అయితే మళ్ళీ ఏమనుకున్నారో? ఏమో ? తెలియదు కానీ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.

ఒకరిని అడుక్కోరు
అలాగే జగన్ తో సినీ ప్రముఖుల భేటీని ఉద్దేశిస్తూ 'చిరంజీవి గారు.. మీలాగా మీ సోదరుడు పవన్ ఎప్పటికీ ఒకరిని అడుక్కోరు. మీకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ఆదరణ పొందడానికి కారణం అదే. మెగా అభిమానులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు' అని ఆర్జీవీ అన్నారు. ఆయన ఈ కామెంట్స్ వ్యంగ్యంగా అన్నారా.? లేక నిజంగానే పవన్ ని పొగిడారా.? అని కూడా చర్చలు జరుగుతున్నాయి.

బాహుబలి లెవల్ బెగ్గింగ్
ఆ తరువాత కూడా వర్మ నిన్నటి సినీ పెద్దల సమావేశం పై సెటైర్లు వేశారు. 'సూపర్, మెగా, బాహుబలి లెవల్ బెగ్గింగ్ వల్ల ఇది జరిగినా.. ఒమేగా స్టార్ వైఎస్ జగన్ వారిని ఆశీర్వదించినందుకు సంతోషిస్తున్నా. సూపర్, మెగా, బాహుబలిని మించిన మహాబలి జగన్ ను అభినందిస్తున్నా. ఏపీ ప్రభుత్వం, తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య ఉద్రిక్తతలను జగన్ చల్లార్చి, సంతోషకరమైన ప్రయాణానికి మార్గం వేశారు' అని ట్వీట్లు చేశారు వర్మ .


Click it and Unblock the Notifications











