Just In
- 1 hr ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
'కుట్ర'కు కారణమదే.. జేసీని టార్గెట్ చేసిన తరహాలో స్కెచ్.. ఆ ఇద్దరిపై రఘురామ ఎటాక్,జగన్‌కూ హెచ్చరిక...
- Sports
నాలుగు నగరాల్లో ఐపీఎల్ 2021.. హైదరాబాద్‌లో కూడా మ్యాచులు!!
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వావ్! వర్మకు భలే ఆలోచన వచ్చిందే.. మరో సంచలనానికి నాంది.. టార్గెట్ ఎవరంటే..
సంచలనాలకు కేంద్రబిందువు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టించిన ఆయన ఈ సారి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ గొడ్డలి పెట్టుకు రెడీ అయ్యాడు. ఏ మాత్రం కాంట్రవర్సీ లేదంటూనే ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ రిలీజ్ చేస్తూ సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాడు. తాజాగా దీనికి కూడా కొనసాగింపు ప్రకటించాడు వర్మ.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సీక్వెల్
ఇప్పటికే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అప్‌డేట్స్ ద్వారా సంచలనం సృష్టిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా అనౌన్స్ చేసేయడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే సినిమాకు సీక్వెల్ తీయాలనే ఆలోచన వచ్చిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు వర్మ.

టీడీపీకి గుడ్ బై చెప్పిన తర్వాత
టీడీపీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ ఫైర్ అవుతున్న ఇంటర్వ్యూలు చూశాక తనకు ఓ ఐడియా వచ్చిందని తెలిపిన వర్మ.. ఏకంగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు సీక్వెల్ రూపొందిస్తానని చెప్పేశాడు. పైగా ఆ సినిమా టైటిల్ కూడా ఆయన ప్రకటించడం సినీ, రాజకీయ వర్గాలకు మరో షాకిచ్చింది.

టైటిల్ ఇదే.. పోలీస్ కేసు వరకూ
ఈ సీక్వెల్‌కు 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు రామ్ గోపాల్ వర్మ. ఇదిలా ఉంటే వర్మ తాజా సినిమా టైటిల్ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ఇప్పటికే వివాదాస్పదమై పోలీస్ కేసు వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. కులాల పేరుతో పెట్టే ఇలాంటి టైటిల్స్ ప్రజల మధ్య అంతరాన్ని పెంచుతాయని పలువురు రాజకీయ నేతలు ఆరోపిస్తున్నారు.
|
ప్రత్యేకంగా ఓ పార్టీకి చుక్కలు చూపిస్తూ..
ఇటీవలే విడుదల చేసిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా ట్రైలర్‌లో ప్రతీ ఒక్కరినీ టార్గెట్ చేస్తూ తనదైన కోణంలో సన్నివేశాలు చూపించాడు వర్మ. ముఖ్యంగా ఓ పర్టికులర్ పార్టీకి చుక్కలు చూపించాడు. మొత్తానికి ఈ సినిమా నుంచి విడుదలవుతున్న అప్‌డేట్స్ చూస్తుంటే 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది.

టార్గెట్ రీచ్ అయ్యే దాకా వదలడా? ఏంటి..
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా, దానిపై వర్మ ఇస్తున్న అప్‌డేట్స్ విడుదలకు ముందే ఇలాసంచలనం క్రియేట్ చేస్తుండటం చూసి ఇక విడుదలైతే ఆ సెన్సేషన్స్ ఊహించడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. పైగా అప్పుడే దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేయడం చూస్తుంటే.. వర్మ టార్గెట్ రీచ్ అయ్యే దాకా వదిలేలా లేడని తెలుస్తోంది.