సినిమా ఇండస్ట్రీ అలా తయారైంది..ప్రొడ్యూసర్ అమ్మాయి లైఫ్ పాడు చేస్తున్నాడు..వర్మ సెన్సేషనల్ కామెంట్స్

విలక్షణత, వివాదాస్పదం అన్నింటికీ కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ. కేవలం సినిమాలతోనే కాదు మాటల తోనూ సంచలనం సృష్టించడం వర్మకే సాధ్యం. తాను ఏది మాట్లాడినా, ఏది చేసినా, దానిపై ఎవరి స్పందన ఎలా ఉన్నా.. నా లాజిక్ నాది అన్నట్లుగా బెహేవ్ చేస్తుంటాడు వర్మ. ఈ నేపథ్యం లోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు రామ్ గోపాల్ వర్మ.

సినీ ఇండస్ట్రీలో మూఢ నమ్మకాలు

సినీ ఇండస్ట్రీలో మూఢ నమ్మకాలు

తన మనసుకు ఏదనిపిస్తే అది ముక్కుసూటిగా మాట్లాడే రామ్ గోపాల్ వర్మ.. తాజాగా అదే రిపీట్ చేశాడు. ఎప్పుడూ వివాదాలకు చిరునామాగా ఉండే ఆయన ఈ సారి మూఢ నమ్మకాలు, వాటి ప్రభావం సినిమా ఇండస్ట్రీపై ఎలా పడుతోంది? కొందరు దర్శకనిర్మాతల తీరు ఎలా ఉందనే దానిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

జాతకాలు, నమ్మకాలు రియాక్ట్ అయిన వర్మ

జాతకాలు, నమ్మకాలు రియాక్ట్ అయిన వర్మ

జాతకాలు అనేవి ఉన్నాయని నమ్ముతున్నారా? అని యాంకర్ అడిగిన ప్రశ్నపై తనదైన కోణంలో రియాక్ట్ అయ్యాడు వర్మ. తాను జాతకాలు, నమ్మకాలు అనేవి పెద్దగా పట్టించుకోనని, అలాంటివి నమ్మే వాళ్ళను కూడా తాను అస్సలు పట్టించుకోనని అన్నాడు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇనప్పాదం అనే పేరుతో జరుగుతున్న చర్య దారుణమని వర్మ పేర్కొన్నాడు.

ఇలాంటివి అస్సలు సహించను

ఇలాంటివి అస్సలు సహించను

ఈ రోజున షూటింగ్ చేయొద్దు.. ఈ ప్రదేశంలో షూట్ చేస్తే కలిసిరాదు.. షూటింగ్ సమయంలో ఈ వ్యక్తి ఉంటే ఇక అంతే! ఇలాంటివి తాను అస్సలు సహించనని అంటున్నాడు వర్మ. మూఢ నమ్మకాల వల్ల కొందరు వ్యక్తులు అవమానం పాలు కావాల్సి వస్తుందని, మూఢ నమ్మకం అనేది హానికారకమైందని వర్మ చెప్పుకొచ్చాడు.

ఓ ప్రొడ్యూసర్ అమ్మాయి లైఫ్‌తో..

ఓ ప్రొడ్యూసర్ అమ్మాయి లైఫ్‌తో..

దీనికి ఉదాహరణగా ఓ సందర్భాన్ని కూడా వివరించాడు వర్మ. ఈ మధ్యనే ఓ ప్రొడ్యూసర్ ఓ అమ్మాయిని పట్టుకొని ఇనప్పాదం అన్నాడని, అంటే వాడు ఆ అమ్మాయి కెరీర్‌ని, అమ్మాయి లైఫ్‌ని పాడు చేస్తున్నట్లు అర్థమని చెప్పాడు వర్మ. అమ్మాయికి, సినిమా ఆడకపోవడానికి సంబంధమేంటో అర్థం కావడం లేదని కామెంట్ చేశాడు. అయితే ఆ ప్రొడ్యూసర్ ఎవరనేది మాత్రం చెప్పలేదు వర్మ.

ఆ అమ్మాయి జాతకం బాగా లేకపోతే..

ఆ అమ్మాయి జాతకం బాగా లేకపోతే..

ఒకవేళ ఆ అమ్మాయి జాతకం బాగా లేకపోతే అక్కడున్న మిగితా వాళ్ళ జాతకం ఏం చేస్తున్నట్లు? తనదైన లాజిక్ లేవనెత్తాడు వర్మ. అంటే.. ఈమె ఒక్కదాని జాతకం ముందు అక్కడున్న వారందరి జాతకం ఓడినట్లేనా? అని సూపర్ లాజిక్ చెప్పి మూఢ నమ్మకాలపై ఫైర్ అయ్యాడు వర్మ. మూఢ నమ్మకమనేది జీవితంలో అత్యంత హానికరమైందని ఆయన అన్నాడు.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

ఇక వర్మ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ తో రాజకీయ సంచలనం సృష్టించి, ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో సునామీకి రెడీ అవుతున్నాడు. కాంట్రవర్సీ లేదంటూనే అప్‌డేట్స్ ఇస్తూ సినీ, రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X