అల్లు అర్జున్‌కు తెలంగాణ సర్కార్ రిటర్న్ గిఫ్ట్.. స్టార్ డైరెక్టర్ పోస్ట్ వైరల్..
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఇండస్ట్రీని మొత్తం షాక్ కు గురయ్యేలా చేసింది. శుక్రవారం నాడు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి, నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ సమయంలో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పించింది. దీంతో అల్లు అర్జున్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మద్యం తన పేరును మంజూరు చేసింది. అయితే ఉత్తర్వుల జారీ ఆలస్యం కావడంతో ఈరోజు శనివారం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు విడుదలయ్యారు. ఈ ఘటనపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తనదైన శైలిలో స్పందించారు.
పుష్ప 2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా హీరో అ్లల్లు అర్జున్.. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వెళ్లారు. ఈ క్రమంలో భారీ మొత్తం ఫ్యాన్స్ చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రేవంతి అనే మహిళ అభిమాని ప్రాణాలు కోల్పోయారు. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితి ఉన్నారు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను శుక్రవారం నాడు తన ఇంటి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అల్లు అర్జున్ స్టేట్మెంట్ నమోదు చేసుకుని.. అతనిపై 105, 118(1), రెడ్ విత్ 3/5, బి ఎం ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల అనంతరం అక్కడి నుండి భారీ బందోబస్తు నడుమ నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులోను అల్లు అర్జున్ కు షాక్ తగిలింది. కానీ, మధ్యంతర బెయిల్ మంజూర్ చేశారు. కానీ, అయితే బెయిల్ ఉత్తర్వుల జారీ ఆలస్యం కావడంతో ఈరోజు (శనివారం) ఉదయం 6 గంటల 45 నిమిషాలకు విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ ను పరామర్శించడానికి, ఆయనకు సంఘీభావం తెలుపుతూ పలువురు సినీ ప్రముఖులు అల్లు వారి ఇంటికి క్యూ కట్టారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కు సంఘీభావం తెలుపుతూ తమ మద్దతును ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా(X) వేదికగా స్పందిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశారు.

గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా ఎందుకు చేసారో అందరికి ఆశ్చర్యం కలిగించిందనీ, అల్లుఅర్జున్, Pushpa2 వారం 2 వసూళ్లలో భారీ పెరుగుదల కోసం తెలంగాణ రాష్ట్ర ఫేవరెట్ బిడ్డకు భారీ పబ్లిసిటీ బూస్ట్ ఇవ్వాలనుకున్నారని ఇలా చేసి ఉంటారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన కొన్ని గంటల్లో బెయిల్ రావడంతో మెగా పాపులర్ అయ్యి బాక్స్ లాంగ్ టైమ్ రూల్ చేయడానికి దోహదపడిందని తెలిపారు. దీంతో తెలంగాణ రాష్ట్ర గర్వాన్ని గొప్పతనాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టినందుకు థాంక్యూ సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదెలా ఉండగా.. అల్లు అర్జున్ అరెస్ట్ పై శుక్రవారం నాడు కూడా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశారు. తెలంగాణ పోలీసులకు, అధికారులకు దిమ్మతిరిగిపోయేలా నాలుగు ప్రశ్నలు వేశారు. అందులో 1. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలలాంటి వేడుకుల్లో తోపులాటల్లో భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా?, 2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా?, 3. ప్రీరిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా?, 4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు? అంటూ ఆర్జీవి దిమ్మతిరిగే ప్రశ్నలు వేశారు. రామ్ గోపాల్ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











