twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజా అందాన్ని పాడుచేసిన బాలకృష్ణ! రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్

    |

    గత కొంతకాలంగా వివాదం సృష్టించడం తన ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నటున్నాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయనో డిఫరెంట్ వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అందరికీ తెలుసు.. కానీ, మరీ ఇంత డిఫెరెంటా అన్నట్లుగా ఉంది వర్మ ప్రెజెంట్ సిచ్యుయేషన్. ఏకంగా నందమూరి నటసింహం బాలకృష్ణపై అటాక్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశాడు వర్మ. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి పోతే..

     రోజా- బాలకృష్ణ సెల్ఫీ.. హల్చల్

    రోజా- బాలకృష్ణ సెల్ఫీ.. హల్చల్

    ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ అదేవిధంగా ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా మీట్ అయ్యారు. బుధవారం రోజు కలుసుకున్న ఈ ఇద్దరూ సరదాగా ఓ సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేయబడి ఆన్‌లైన్ వేదికలపై హల్చల్ చేస్తోంది.

    వర్మ దారుణమైన కామెంట్స్.. ఎక్కడ చూసినా అదే మ్యాటర్

    వర్మ దారుణమైన కామెంట్స్.. ఎక్కడ చూసినా అదే మ్యాటర్

    ఈ సెల్ఫీ అరుదైన ఫోటో చూసిన రామ్‌గోపాల్‌ వర్మ.. దాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందిస్తూ దారుణమైన పోస్టులు పెట్టాడు. బాలకృష్ణ, రోజాలపై వరుస కామెంట్లు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో ఈ సెల్ఫీ మ్యాటర్ ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. ఎక్కడ చూసినా రోజా- బాలకృష్ణ సెల్ఫీ గురించే మాట్లాడుకుంటున్నారు.

    రోజా పక్కనే అసహ్యంగా.. షాకింగ్ కామెంట్స్

    ''వావ్!! రోజా గారు అచ్చం హీరోలా కనిపిస్తున్నారు. ఆమె పక్కన ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలీదు కానీ.. యాక్! చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నాడు (బాలకృష్ణను ఉద్దేశిస్తూ). రోజా పక్కన కూర్చుని ఆమె అందాన్ని పాడుచేశాడు. బహుశా అతను రోజాకి దిష్టిబొమ్మ అనుకుంటా'' అని షాకింగ్ పోస్ట్ వదిలాడు వర్మ.

    మీరు చెప్పగలరా? అంటూ వర్మ బాణం

    ఆ తర్వాత వెంటనే మరో పోస్ట్ చేసిన వర్మ.. ''అందమైన రోజా గారి పక్కన కూర్చుని.. ఆ ఫోటోను నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా?'' అని ప్రశ్నిస్తూ మరో ట్వీట్‌ చేశాడు. దీంతో రోజా- బాలకృష్ణ సెల్ఫీ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.

    వర్మపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్

    వర్మపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్

    బాలకృష్ణపై రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ కామెంట్స్ చూసి నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఓ నెటిజన్ వర్మ పక్కన బాలకృష్ణ కూర్చున్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. ''లయన్ బాలయ్య పక్కన కూర్చుని ఫొటోను పాడుచేసిన ఆ వ్యక్తి ఎవరో చెప్తారా'' అంటూ వర్మకు రిటర్న్ కౌంటర్ వేశారు. దీంతో ప్రస్తుతం ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

    రోజా జబర్దస్త్ కిక్.. బాలయ్య డీలా

    రోజా జబర్దస్త్ కిక్.. బాలయ్య డీలా

    ఇటీవలే రూలర్ సినిమాతో భారీ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. ఇక తన 106వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. బోయపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. మరోవైపు రాజకీయాలతో పాటు జబర్దస్త్ కిక్కిస్తోంది రోజా.

    English summary
    Roja- Balakrishna Selfie viral on social media. Now Ram Gopal Varma sheres this selfie pic and commented sensationally.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X