twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విజయ్ దేవరకొండను తొక్కేయడానికి ప్లాన్.. ఇండస్ట్రీలో అలాంటివి సహజమే.. రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్

    |

    ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో లైగర్, విజయ్ దేవరకొండ సినిమాలపై జరిగిన రచ్చ మరో విషయం మీద జరగలేదనే స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే విజయ్ దేవరకొండను తొక్కేయడానికి టాలీవుడ్ హీరోలు ప్రయత్నించారనే విషయంపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. సినిమా రిలీజ్‌కు ముందే విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్, పూరీ, చార్మీలకు వ్యతిరేకంగా 2 వేలకుపైగా వీడియో రివ్యూలు రావడం భారీ చర్చకు దారి తీసింది. ఉద్దేశపూర్వకంగానే విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడా అనే విషయంపై రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ...

    సుశాంత్ రాజ్‌పుత్ మరణం తర్వాత

    సుశాంత్ రాజ్‌పుత్ మరణం తర్వాత

    బాయ్‌కాట్ బాలీవుడ్ అనేది ప్రధానంగా కరణ్ జోహర్‌ను టార్గెట్‌గా చేస్తూ కొనసాగుతున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌పై చాలా వ్యతిరేకత పెరిగింది. బాలీవుడ్ ప్రేక్షకులు టాలీవుడ్ హీరోలపై సానుకూలం దృష్టిపడింది. అదే సమయంలో లైగర్ విషయంలో నాలుగు ఊహించని విషయాలు తెరపైకి వచ్చాయి. విజయ్ దేవరకొండలో వినయం కనిపించకపోవడం ఆ సినిమాకు ప్రధానంగా ప్రతికూలమైంది అని వర్మ చెప్పారు.

    అర్జున్ రెడ్డికి ముందే అలాంటి

    అర్జున్ రెడ్డికి ముందే అలాంటి

    టాలీవుడ్‌లో ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్ చాలా నమ్రత, వినయంతో కనిపిస్తారు. విజయ్ దేవరకొండ చాలా అగ్రెసివ్‌గా ఉంటాడు. కానీ విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ లైగర్ సినిమాతో రాలేదు. తన అర్జున్ రెడ్డి సినిమాకు ముందే అలాంటి యాటిట్యూడ్ ఉంది. అందుకే విజయ్ స్టార్ అయ్యాడు. కానీ లైగర్ సినిమా సమయంలో బ్యాడ్ టైమ్ వచ్చింది. అందుకే బాలీవుడ్ ప్రేక్షకులు విజయ్ దేవరకొండను ఓన్ చేసుకోలేకపోయారు అని వర్మ అభిప్రాయపడ్డారు.

    విజయ్ దేవరకొండను తొక్కేసేందుకు

    విజయ్ దేవరకొండను తొక్కేసేందుకు


    విజయ్ దేవరకొండ ఎదుగుదలను పకడ్బందీగా తొక్కేసేందుకు టాలీవుడ్ వర్గాలు ప్లాన్ చేశారనే ప్రశ్నకు వర్మ సమాధానం ఇస్తూ.. ఒక హీరో ఎదుగుతున్నాడంటే.. చాలా మంది హీరోలకు జెలసి. ఎదిగే హీరోను తొక్కేయడం ఎప్పటి నుంచో ఉంది. అది సినిమా ఇండస్ట్రీలో సహజం. ఒక హీరో అంటే.. మరో హీరోకు పడటకపోవడం మానవ సహజం అని వర్మ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఒక హీరో అభిమానులు మరో హీరోపై వీడియోలు చేసి టార్గెట్ చేయడం విజయ్ దేవరకొండ విషయంలో జరిగింది. ఆ చాన్స్ వాళ్లకు లభించేలా విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ వర్కవుట్ అయింది అని రాంగోపాల్ వర్మ చెప్పాడు.

    లైగర్ కంటెంట్ బాగా లేకపోవడం వల్ల

    లైగర్ కంటెంట్ బాగా లేకపోవడం వల్ల

    విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డికి ముందు నుంచి అదే యాటిట్యూడ్‌తో మాట్లాడుతున్నాడు. అందుకే బిగ్ స్టార్ అయ్యాడు. ఇప్పటికి విజయ్ దేవరకొండ ఏం మారలేదు. కానీ పరిస్థితులు విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా మారడం వల్ల ఇలాంటి వాదనలు తెరపైకి వచ్చాయి. విజయ్‌లో ఎలాంటి మార్పు లేదు. లైగర్ కంటెంట్ బాగా లేకపోవడంతో ట్రోల్స్, వీడియోలు విచ్చలవిడిగా యూట్యూబ్‌లో కనిపించాయి అని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.

    విజయ్ దేవరకొండపై సానుకూలంగా

    విజయ్ దేవరకొండపై సానుకూలంగా

    విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ ఎవరికి నష్టం చేయదు. ఎన్నో విషయాల్లో సేవలు చేస్తున్నాడు. లైగర్ సినిమా ప్రమోషన్స్‌లో ఓ కుర్రాడు బట్టలు లేవు అంటే.. రౌడీ బ్రాండ్ నుంచి నీకు బట్టలు ఇస్తాను. ఎవడే సుబ్రమణ్యం సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో నాకు బట్టలు లేవు. సినిమాకు వాడిన క్యాస్టూమ్ వేసుకొని నేను ప్రమోషన్స్‌కు వెళ్లాను అని విజయ్ దేవరకొండ చెప్పిన విషయాలపై రాంగోపాల్ వర్మ సానుకూలంగా స్పందించాడు. లైగర్ విషయంలో ట్రోల్స్‌కు రకరకాల కారణాలు ఉన్నాయి అని అభిప్రాయపడ్డాడు.

    English summary
    Ram Gopal Varma sensational comments on Vijay Deverakonda and Liger disaster in his latest Television interview. He said, He become star because of his attitude.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X