ఇది ఎవరి భార్య పనో! నాకు అనుమానంగా ఉంది.. రామ్ గోపాల్ వర్మ సంచలనం
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వింటేనే సంచలనాలు గుర్తొస్తాయి. అది ఎలాంటి సందర్భమైనా, ఎవ్వరు ఏమనుకున్నా తన మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఒక్క వర్మకే చెల్లుతుంది. అదే కోణంలో ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై స్పందిస్తూ సంచలన కామెంట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. వివరాల్లోకి పోతే..
Recommended Video

విజృంభిస్తున్న కరోనా.. అందరూ ఇళ్లలోనే
కరోనా కట్టడికి ఏకైక మార్గం సామాజిక దూరమే అని వైద్య నిపుణులు పేర్కొంటున్న కారణంగా ప్రపంచ జనాభా అంతా ఇళ్లకే పరిమితమైపోయింది. ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో ప్రతీ వ్యక్తి అత్యవసరమైతే తప్ప ఇంటి గడపదాటి బయట అడుగుపెట్టడం లేదు. సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు అనే తేడాలేకుండా అందరూ హోమ్ క్వారంటైన్‌లో ఉండిపోయారు.

ఎవరి భార్యనో ఇలా.. వర్మ అనుమానం
ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తన మెదడుకు పదును పెట్టి సంచలన ట్వీట్ చేశారు. సాధారణంగా ప్రతీ ఇంటి ఇల్లాలు తన భర్త ఎక్కడా తిరగకుండా ఎక్కువ సమయం తనతోనే గడపాలని కోరుకుంటుంది కదా. ఇదే పాయింట్ లెక్కలోకి తీసుకున్నాడో ఏమో గానీ.. ''కరోనా వైరస్ పంపించమని ఎవరి భార్యనో ఆ దేవుడిని కోరినట్లుందని అనుమానంగా ఉంది'' అంటూ ట్వీట్ చేశారు వర్మ.

రామ్ గోపాల్ వర్మ రీజన్స్..
అంతేకాదు దీనికి రీజన్స్ కూడా చెప్పారు వర్మ. ''బయటి ఆటపాటలు రద్దు, బార్లు పబ్బులు మూత, స్నేహితులను కలవడం బంద్, ఆఫీసులో పని ఉందని అబద్దం చెప్పలేం, ఇక చివరగా ఉన్న సమయాన్నంతా భార్యతోనే గడపాల్సిన పరిస్థితి'' అని వర్మ పేర్కొన్నారు.

నెటిజన్స్ రెస్పాన్స్.. జై రామ్ గోపాల్ వర్మ
వర్మ చేసిన ఈ ట్వీట్ చూసి నెటిజన్స్ పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ''చాలా మంది భార్యలు చాలా ఆనందం గా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ భర్తలు వాళ్ళ దగ్గరే ఉంటున్నారు కాబట్టి.. Because effect of Carona. జై రాంగోపాల్ వర్మ, ఫన్నీ'' అంటూ కామెంట్ చేస్తున్నారు.
వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటే నెత్తినెక్కి కూర్చుంటారు
కర్ఫ్యూ నేపథ్యంలో ఓ పోలీస్ ఆఫీసర్.. నిన్ను నిన్ను కాపాడుకోవడమే కాదు.. నీ చుట్టూ ఉన్నవాళ్లని.. ఈ దేశాన్ని కాపాడు అంటూ ప్రాధేయపడుతూ దండం పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో చేశారు. దీనిపై రియాక్ట్ అయిన వర్మ.. 'పోలీసులకు ఇచ్చే సలహా ఏంటి అంటే.. మీరు ప్రజల దగ్గర ప్రాధేయపడుతూ వాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్లు మీ నెత్తినెక్కి కూర్చుంటారు' అని అన్నారు.


Click it and Unblock the Notifications











