వర్మ ఆఫీస్‌పై రాళ్లదాడి: వాళ్లంతా పిచ్చివాళ్లు.. ఇదోరకం రౌడీయిజం: ఆర్జీవి
పవర్ స్టార్ సినిమా ప్రమోషన్ నేపథ్యంలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో దర్శకుడు రాంగోపాల్ వర్మ విసిరిన సవాల్‌కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్పందించారు. గురువారం మధ్నాహ్నం కొందరు విద్యార్థులు వర్మ ఆఫీస్‌లోకి దూసుకెళ్లారు. అక్కడి సిబ్బందితోపాటు అక్కడికి చేరుకొన్న పోలీసులతో వాగ్వాదం దిగారు. ఆ క్రమంలో వర్మ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. వివరాల్లోకి వెళితే..

సిబ్బంది వర్సెస్ ఓయూ విద్యార్థులు
గురువారం 4 గంటల సమయంలో మొత్తం ఎనిమిది మంది వర్మ ఆఫీస్‌కు చేరుకొన్నారు. వారిని అడ్డుకోవడంతో కొంత గందరగోళం నెలకొన్నది. వారిని అడ్డుకొనేందుకు సిబ్బంది ప్రయత్నించారు. దాంతో వర్మ రమ్మంటేనే వచ్చాం. ఆయనతో మాట్లాడుతామని సిబ్బందితో వాగ్వాదం జరుగుతున్న సమయంలో వర్మ వారితో మాట్లాడేందుకు నిరాకరించారు.

నేను ఎవ్వరినీ ఆహ్వానించలేదు
టెలివిజన్‌లో ఎటాక్ చేయడానికి వస్తే నా ఆఫీస్‌కు రమ్మన్నాను. అలా అని నేను రమ్మని ఆహ్వానించలేదు. వారికి మెసేజ్, ఫోన్ చేసి రమ్మనలేదు. వాళ్లంతా పిచ్చినా కొడుకులు. వచ్చిన వాళ్లు మాతో గొడవ పడి.. వాళ్లకు వాళ్లే కొట్టుకొన్నారు అని వర్మ పేర్కొన్నారు. నా వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తదు. ఇది లా అండ్ ఆర్డర్ సమస్యే కాదు. ఇది ఓ రకమైన రౌడీయిజం అని వర్మ అన్నారు.

ఎవరికీ సవాల్ విసరలేదు
నేను ఎవరికీ సవాల్ విసరలేదు. ఎవరైనా ఎటాక్ చేస్తే ఎలా అనే మీడియా ప్రశ్నకు నేను నా ఆఫీస్ అడ్రస్ గూగుల్ దొరుకుతుందని చెప్పాను. అంతేగానీ నేను మాట్లాడిన విషయాన్ని మీడియా వివాదం చేస్తున్నారు. జనసేన, పవన్ ఫ్యాన్స్ నా ఆఫీస్‌కు రావడం వల్ల నా సినిమాకు మరింత వ్యూస్ పెరుగుతాయి. ఇప్పుడు జరిగిన దానికి నేను చాలా హ్యాపీగా ఉంది అని వర్మ తెలిపారు.
Recommended Video

పవన్ ఫ్యాన్స్ అని ఇప్పుడు చెప్పలేదా?
వర్మ కార్యాలయంలోకి దూసుకొచ్చిన విద్యార్థులు జనసేన, పవన్ ఫ్యాన్స్‌కు సంబంధించిన వ్యక్తులు ఎవరనే విషయంపై ఇప్పుడే స్పందించలేను. అన్ని విషయాలు తెలిసిన తర్వాత నేను ఎవరన్నది చెబుతాను అని వర్మ పేర్కొన్నట్టు తెలిసింది. అయితే పవన్ ఫ్యాన్సే దాడి చేశారని తాను చెప్పను అన్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











