చిరంజీవి, త్రివిక్రమ్, చంద్రబాబును టార్గెట్ చేసిన వర్మ.. పవర్‌స్టార్‌పై వరుస ట్వీట్లు
దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న పవర్ స్టార్ మూవీ రిలీజ్ నేపథ్యంలో ట్విట్టర్‌లో ప్రమోషన్ వేగం పెంచారు. వరుస ట్వీట్లతో చిరంజీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. ట్విట్టర్‌లో వర్మ పోస్టు చేసిన వీడియోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. తన ట్వీట్లలో ఆ ముగ్గురిపై వేసిన ట్వీట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. వివరాల్లోకి వెళితే..

ప్రవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్ లాంటి వ్యక్తి
ట్విటర్‌లో వర్మ రిలీజ్ చేసిన వీడియోలో ప్రవన్ కల్యాన్ మీ మాటలు అంత బాగుంటాయి.. అంటూ ఏదో చెప్పబోతుంటే.. త్రివిక్రమ్ పాత్రను పోలి ఉన్న క్యారెక్టర్.. మీరు అలా అనకండి సార్.. నేను తట్టుకోలేను. మీరు నేను దాచుకొన్న సైన్యం. నేను చేయబోయే యుద్ధం. మీరు ఒక ఉప్పెన. సునామీ అంటూ ఉంటే.. ప్రవన్ కల్యాణ్ ఇక చాలూ చాలూ అనడంలో వీడియోలో హైలెట్.

ప్రవన్‌తో చంద్రబాబును పోలి ఉన్న క్యారెక్టర్
ఇక రెండో వీడియోలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలి ఉన్న క్యారెక్టర్‌లోని వ్యక్తి మాట్లాడుతూ.. జయపజయాలకు ఎవరూ అతీతులు కాదు. మీమే తప్పు చేశామని అనడం అసలే కరెక్ట్ కాదు అంటే.. మీరు ఇలాంటి దొంగతనాలు మానితే మంచిది అని ప్రవన్ కల్యాణ్ అంటే.. ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ చంద్రబాబును పోలిన వ్యక్తి కామెంట్ విసిరారు. ఈ వీడియోను పట్టి పవర్ స్టార్ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో గుర్తుపట్టండి అంటూ వర్మ కామెంట్ చేశారు.

చిరంజీవి లాంటి వ్యక్తితో పవన్ కల్యాణ్
ఇక చిరంజీవి పోలిన వ్యక్తితో ప్రవన్ కల్యాణ్ మధ్య సన్నివేశాలు ఎమోషనల్‌గా కనిపించాయి. నీవు పార్టీ పెడితే నిన్ను తట్టమను. నన్ను ఎందుకు తిడుతున్నారు. మీ అన్నయ సీట్లు అమ్ముకొన్నాడు.. మీ అన్న పార్టీ విలీనం చేశాడు అని అది చేశాడు ఇది చేశాడు అని ప్రతీ ఒక్కడు నన్ను తిడుతాడు ఏంటిరా అంటూ మెగాస్టార్‌లా ఉన్న వ్యక్తి అనడం మూడో వీడియోలో కనిపించింది. ఈ వీడియోను పోస్టు చేసి వారిద్దరు అన్నదమ్ములా? అంటూ ప్రశ్నను సంధించారు.
Recommended Video

జూలై 25న రిలీజ్
పవర్ స్టార్ మూవీ జూలై 25న ఆర్జీవివరల్డ్‌థియేటర్‌లో రిలీజ కానున్నది. ఇ్పటికే ఈ ట్రైలర్ 35 లక్షల వ్యూస్ సాధించింది. అందకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు థ్యాంక్స్. మీరు 11 గంటలకు సినిమా రిలీజ్ విషయాన్ని మరిచిపోకుండి అంటూ వర్మ సెటైర్లు వేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.


Click it and Unblock the Notifications











