హీరోయిన్ సెమీ న్యూడ్ ఫొటోను షేర్ చేసిన వర్మ.. దీనిపై ఆమె రియాక్షన్ చూస్తే అవాక్కవుతారు.!

Recommended Video

RGV Shares Actress Steamy Picture, Goes Viral || Filmibeat Telugu

తెలుగు సినీ పరిశ్రమ ద్వారా పరిచయమై దేశ వ్యాప్తంగా సుపరిచితం అయ్యాడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. కొన్నేళ్లుగా ఆయన ఏది చేసినా చర్చనీయాంశమే అవుతోంది. గతంలో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు చేసిన ఈ దర్శకుడు.. కొద్దిరోజులుగా తన పంథాను మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే వివాదాస్పద అంశాలపై సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతున్నాడు. అదే సమయంలో సోషల్ మీడియాలో సైతం ఎంతో మందిపై కామెంట్లు చేస్తూ నిరంతరం వార్తల్లో ఉంటాడు. తాజాగా ఆయన మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

రాంగోపాల్ వర్మ సినిమాలు చేస్తూ ఉన్నా.. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న ఆయన.. సామాజిక మాధ్యమాల్లో కూడా భిన్నంగా వ్యవహరిస్తుంటాడు. తన వ్యక్తిగతం అంశాలను పక్కన పెట్టి ఇతరులపై తరచూ ఏవో ఒక కామెంట్లు చేస్తూనే ఉంటాడు. దీంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. అదే సమయంలో నెటిజన్ల ట్రోల్స్‌కు కూడా గురవుతున్నాడు.

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్

దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా అనుభవాలతో కూడిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. దీన్ని డైరెక్టుగా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ చేశాడు వర్మ. ఎన్నో వివాదాలు.. మరెన్నో ఆటంకాల మధ్య ‘జీఎస్టీ' గత సంవత్సరం రిపబ్లిక్ డే రోజు విడుదల చేద్దామనుకున్నాడు. అప్పుడు వెబ్‌సైట్ క్రాష్ అవడంతో జనవరి 27న ఆన్‌లైన్‌లో విడుదలైంది. దీనికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే.

సెమీ న్యూడ్ ఫొటోతో హల్‌చల్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాంగోపాల్ వర్మ జీఎస్టీ హీరోయిన్, సంచలన తార మియా మాల్కోవా సెమీ న్యూడ్ ఫొటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో శాండియాగో బీచ్‌లో బికినీతో పడుకుని ఉన్న ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, ‘ఈ ఫొటోకు మీరే క్యాప్షన్ పెట్టండి. అలాగే, మీకు నచ్చితే దీన్ని రీట్వీట్ చేయండి' అని రాసుకొచ్చింది. దీనిపై ఎంతో మంది పలు రకాలుగా రాసుకొస్తున్నారు.

 హీరోయిన్ ఫొటోను షేర్ చేశాడు

హీరోయిన్ ఫొటోను షేర్ చేశాడు

మిలా మాల్కోవా షేర్ చేసిన ఫొటోను రాంగోపాల్ వర్మ రీ ట్వీట్ చేశాడు. ఆమె క్యాప్షన్ పెట్టమనడంతో ‘ఇది దీర్ఘచతురస్రాకార త్రికోణ ఒంపు సొంపులు' అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్జీవీ చేసిన ట్వీట్‌కు మియా కూడా ఓ జిఫ్‌ ఇమేజ్‌ను రిప్లై ఇచ్చింది. వీళ్ల మధ్య జరిగిన ఈ ట్వీట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక, వర్మ చేసిన ట్వీట్ వల్ల మియా మాల్కోవా మరోసారి తెరపైకి వచ్చింది.

ప్రస్తుతం చేస్తున్న సినిమా

ప్రస్తుతం చేస్తున్న సినిమా

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. రెండు కులాలను ఆధారంగా తీసుకుని వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు కులాలను వాడకున్నప్పటికీ వివాదాస్పదం కాని సినిమానే చేస్తానని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో ఉండబోయే పరిస్థితిపై ప్రస్తుతం రాసుకున్న కథ ద్వారా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X