ఆ అమ్మాయితో రాంగోపాల్ వర్మ నైట్ పార్టీ: ఏది పడితే అది చేస్తూ.. గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్

తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టింగ్ సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలతో దేశ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపును తెచ్చుకున్నాడు రాంగోపాల్ వర్మ. కెరీర్ ఆరంభంలో ఎన్నో జోనర్లలో చిత్రాలు చేసి ప్రత్యేకతను చాటుకున్న ఈ సంచలన దర్శకుడు.. ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా కాంట్రవర్శీ మూవీలనే చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'వ్యూహం' అనే పొలిటికల్ ఫిల్మ్‌ను చేశాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఓ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఆ వివరాలను మీరే చూడండి!

వ్యూహం అంటూ వస్తున్నాడు
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ పొలిటికల్ మూవీనే 'వ్యూహం'. ఈ సినిమా వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటించారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. వాస్తవానికి ఇది నవంబర్‌ లేదా డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల ఇది వాయిదా పడుతోంది.

Ram Gopal Varma Shares Crazy Video and Announces VYOOHAM Movie Release Date

అలాంటి కథతో.. వివాదాలు
'వ్యూహం' సినిమా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కింది. ఇందులో అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం చూపిస్తామని వర్మ చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే ఎన్నో వివాదాస్పద అంశాలను జోడించాడు.

లోకేష్ పిటీషన్.. వాయిదానే
'వ్యూహం' సినిమా తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేసి, విడుదలను నిలిపేయాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సినిమాను తాత్కాలికంగా నిలిపివేసింది. ఫలితంగా ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉన్నా ఆగిపోయింది.

Ram Gopal Varma Shares Crazy Video and Announces VYOOHAM Movie Release Date

సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసి
'వ్యూహం' సినిమాపై నారా లోకేష్ వేసిన పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కొద్ది రోజుల క్రితం ఊహించని తీర్పును ఇచ్చింది. ఇందులో ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాదు, ఈ చిత్రాన్ని మరోసారి రివ్యూ చేసి మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఫలితంగా రాంగోపాల్ వర్మ సినిమా విడుదల మరోసారి ఆగిపోయింది.

లైన్ క్లియర్.. వర్మ శుభవార్త
హైకోర్టు తీర్పు వల్ల పలుమార్లు వాయిదా పడిన 'వ్యూహం' సినిమాకు తాజాగా లైన్ క్లియర్ అయింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరోసారి ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు తాజాగా యూ సర్టిఫికేట్​ను జారీ చేసింది. దీంతో వ్యూహం చిత్రం రిలీజ్​కు మార్గం సుగుమం అయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ప్రకటించాడు.

అమ్మాయితో ఫుల్ ఎంజాయ్
'వ్యూహం' సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అవడంతో ఫుల్ హ్యాపీగా ఉన్న రాంగోపాల్ వర్మ.. తాజాగా పబ్‌లో మసూమ్ శంకర్ అనే అమ్మాయితో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఇందులో ఆమెను ఏది పడితే అది చేస్తూ కనిపించాడు. పైగా 'వ్యూహం' ఫిబ్రవరి 23న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఎంజాయ్ చేస్తున్నట్లు పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ వీడియో యమా వైరల్ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X