షాకిస్తున్న RGV బిజినెస్ మైండ్.. 5లక్షల పెట్టుబడితో కోట్లల్లో లాభాలు.. ఇంకా కుప్పలుకుప్పలుగా ఉన్నాయట

విలక్షన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సంచలనమే అనే మాట ఇటీవల కాలంలో చాలా సాధారణంగా మారిపోయింది. వరుస ఇంటర్వ్యూలతో బిజీ అవుతున్న వర్మ మరోవైపు షూటింగ్స్ ని కూడా గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నాడు. అయితే వర్మ పెట్టుబడికి వచ్చిన లాభాలను చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

వరుసగా ఇంటర్వ్యూలు..

వరుసగా ఇంటర్వ్యూలు..

ఎవరు ఏమనుకున్నా సరే.. చేయాలని అనుకున్నది, కాంట్రవర్సీతోనే పూర్తి చేయగల వర్మ ఈ లాక్ డౌన్ ని చాలా గట్టిగానే ఉపయోగించుకున్నాడు. ముందుగా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ డోస్ పెంచాడు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే 20కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చడంటే ఆయన ఏ రేంజ్ లో ఆలోచిస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం.

ఆ సినిమాలతోనే..

ఆ సినిమాలతోనే..

ఎన్నో విలక్షణమైన సినిమాలు చేసిన వర్మకి ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలు ఎలాంటివో అర్థం కాకుండా ఉండదు. కానీ జనాల వీక్ నెస్ ని ఆయనకు తెలుసు కాబట్టి కంటెంట్ ఎలాంటిది సెలెక్ట్ చేసుకున్నాము.. అనే విషయం పట్టించుకోకుండా కేవలం తన తెలివితో సినిమాలకి మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడు.

సొంతంగా ఓటీటీ..

సొంతంగా ఓటీటీ..

మియా మాల్కోవాతో ఎప్పుడు తీసాడో గాని క్లైమాక్స్ సినిమాకు వర్మ పెద్దగా ఖర్చు చేసింది లేదు. కానీ ఆ సినిమాతో కోటికి పైగా లాభాలు అందుకున్నాడు. వర్మ తన సొంతంగా ఆర్జీవి వరల్డ్ అని ఒక ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ని క్రియేట్ చేసుకోవడం బాగా కలిసొచ్చింది. అందుకే వ్యూవ్ కి 100, 200 అంటూ సొంతంగా రేట్ ఫిక్స్ చేసుకొని లాభాలు అందుకుంటున్నాడు.

ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ..

ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ..

ఇటీవల వచ్చిన NNN సినిమాకు వర్మ ఖర్చు చేసింది కేవలం 5 లక్షలే. కానీ మసాలా డోస్ పెంచి తనదైన ప్రమోషన్స్ తో క్రేజ్ వచ్చేలా చేశాడు. విడుదలైన మొదటి గంటల్లోనే 50లక్షలకు పైగా వసూళ్లను అందుకున్న ఆ 20నిమిషాల చిత్రం ఇప్పుడు కోటి వరకు ప్రాఫిట్స్ తెచ్చినట్లు తెలుస్తోంది. తన బ్రాండ్ ఇమేజ్ గురించి పెద్దగా ఆలోచించకుండా వర్మ నచ్చిన స్టైల్ లో లాభాలు అందుకుంటున్నాడు.

Recommended Video

Shruti Haasan Demands Huge Remuneration For Pawan Kalyan's Movie
ఇంకా ఉన్నాయట..

ఇంకా ఉన్నాయట..

కేవలం సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ అయ్యే కాంట్రవర్సీ కథలపైనే వర్మ టార్గెట్ పెట్టాడు. నెక్స్ట్ ప్రణయ్ పరువు హత్య పై అలాగే పవర్ స్టార్ పై కూడా సినిమా చేయబోతున్నాడు. సినిమాలు బావున్నా లేకపోయినా వర్మ మాత్రం టికెట్స్ రేట్స్ పెంచుతూ లాభాలు గట్టిగానే అందుకుంటున్నాడు. ఇప్పట్లో వర్మ సినిమాలకు బ్రేక్ పడేలా కనిపించడం లేదు. ఇంకా కుప్పలు కుప్పలుకుప్పలుగా ఉన్నాయని ఆయన ట్వీట్స్ చూస్తేనే అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X