RGV: తినండి.. తాగండి.. సెX చేయండి.. స్టూడెంట్స్ కు ఆర్జీవీ హితబోధ.. కామెంట్స్ వైరల్

సంచలనాలకు, కాంట్రవర్సీ ట్వీట్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అందుకే ఆయన గురించి తెలుగు ప్రేక్షకులు, సినీ సెలబ్రిటీలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తనకు నచ్చిన స్టైల్ లో ట్వీట్స్, కామెంట్స్ చేస్తూ వివాదాలకు మహారాజుల పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ పై కామెంట్స్ చేసే ఆయన ఇటీవల హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీపై వరుసగా ట్వీట్స్ చేస్తూ హైలెట్ అయ్యారు. అయితే ఆర్జీవీ ట్వీట్స్ మాత్రమే కాకుండా ఆయన మాటలు కూడా అంతే షాకింగ్ గా ఉంటాయి. తాజాగా విద్యార్థులకు సెX పాఠాలు చెప్పి ఆశ్చర్యపరిచారు ఆర్జీవీ.

ప్రేక్షకులు మెచ్చని విధంగా..

ప్రేక్షకులు మెచ్చని విధంగా..


తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప గొప్ప చిత్రాలు చేసి అతి తక్కువ కాలంలో దేశంలోనే క్రేజీ అండ్ డిఫరెంట్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఇప్పటివరకు సుమారు అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీసిన ఆయన.. మరెవరికీ దక్కని విధంగా పాపులారిటీ సాధించికున్నారు. అయితే ఈ ఫేమ్ తర్వాత ప్రేక్షకులు మెచ్చని విధంగా సినిమాలు తీస్తూ విమర్శల పాలయ్యారు. మీ సినిమాల వల్ల ఉపయోగం ఏంటన్న ప్రశ్నకు చూడటం మానేయండి అని సమాధానం ఇచ్చారు.

కేవలం వాళ్లపైనే..

కేవలం వాళ్లపైనే..

రంగీల, సర్కార్, ఆగ్, శివ, క్షణ క్షణ వంటి సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ప్రవర్తనలో, శైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. మరీ ముఖ్యంగా ఆయన అమ్మాయిలతో రచ్చ చేసే విధానంతో పాటు ట్వీట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో హీరోయిన్లకు అదిరిపోయే ఫాలోయింగ్ దక్కుతూ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఈ మధ్య కాలంలో ఆయన కేవలం అమ్మాయిలనే హైలైట్ చేసే సినిమాలు తీస్తున్నాడు.

 నేరుగా ఓటీటీలోకి..

నేరుగా ఓటీటీలోకి..

ఒకప్పుడు డిఫరెంట్ ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా అడల్ట్ తరహా కంటెంట్ సినిమాలు తీస్తున్నారు. ఇందులో భాగంగానే 'జీఎస్టీ', 'క్లైమాక్స్', 'నగ్నం', 'డేంజరస్', 'లడ్కీ' వంటి హాట్ హాట్ మూవీలను తెరకెక్కించారు. వీటిలో కొన్ని థియేటర్లలో విడుదల చేయగా మరికొన్ని నేరుగా ఓటీటీలోకి తీసుకు వచ్చారు. ఇక ట్విటర్ వేదికగా ఆర్జీవీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి ఇటీవల హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ వరకు ఎవరిని వదలకుండా ట్వీట్స్ తో విమర్శలు చేస్తుంటారు.

బాగుపడాలి అనే సిద్ధాంతం..

బాగుపడాలి అనే సిద్ధాంతం..

ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ట్వీట్సే కాదు మైక్ పట్టుకున్నా అలాగే మాట్లాడతారని మరోసారి నిరూపించారు. తాజాగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అకాడమిక్ ఎగ్జిబిషన్ 2023కు రామ్ గోపాల్ వర్మ అతిథిగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. అక్కడ చదువుకుని బాగుపడాలి అనే సిద్ధాంత తన దృష్టిలో వేస్ట్ అని.. తాగండి, సెX చేయండి అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.

అమ్మాయిలకు సైట్ కొట్టేవాడిని..

అమ్మాయిలకు సైట్ కొట్టేవాడిని..


"సాధారణంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పైకి వచ్చాం అని చెప్తారు. దాన్ని నేను నమ్మను. స్మార్ట్ వర్క్ చేయడం నేర్చుకోండి. మనం చేసే పనిని పక్కవాడితో చేయించేలా స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి. నేను కాలేజీకి వచ్చాను కదా అని నేనో పెద్ద గొప్ప స్టూడెంట్ అనుకోవద్దు. నేను బ్యాక్ బెంచ్ లో కూర్చుని నోవెల్స్ చదివేవాడిని. కనకదుర్గమ్మ టెంపుల్ కి వెళ్లి అమ్మాయిలకు సైట్ కొట్టేవాడిని. ఇక నా గురించి చెప్పుకోవాలంటే పిచ్చి నా కొడుకుని, జంతువును" అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.

 ఇక్కడే ఎంజాయ్ చేయండి..

ఇక్కడే ఎంజాయ్ చేయండి..


"యానిమల్స్ కు రిలేషన్స్ ఉండవు. తిండి, ఆకలి, నిద్ర, సెX వాటికవే ఎప్పుడూ కావాలంటే అప్పుడు చేస్తాయి. మనం కూడా జంతువులాంటివారమే. ఇక చావు ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. చనిపోయిన తర్వాత రంభ, ఊర్వశి, మేనకలు ఉంటారని అపోహ పడుతున్నారేమో. ఒకవేళ వారు లేకపోతే ఎలా.. అందుకే ఇక్కడే ఎంజాయ్ చేయండి. తినండి.. తాగండి.. సెX చేయండి" అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. దీంతో అక్కడి వారంత షాక్ అయ్యారు. స్టూడెంట్స్ కు చెప్పే మాటలేనా అని నెటిజన్లు స్పందిస్తున్నారు. అసలు ఆర్జీవీని హితబోధ చేయమని ఎవరు పిలిచారు. ఆయన్ను పిలిస్తే ఇలాగే ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X