Ram Goal Varma: నగ్నంగా యంగ్ హీరో.. ఆర్జీవీ హాట్ కామెంట్లు!

బాలీవుడ్ కు చెందిన నటుడు విద్యుత్ జమ్వాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. ఆయన పేరు చెప్పినా ఎక్కువగా ఎవరు గుర్తు పట్టరు. కానీ శక్తి సినిమాలో, ఊసర వెళ్లి సినిమాల్లో కనిపించిన ఇతడి ఫొటోను చూస్తే అంతా గుర్తు పడతారు. 2011లో తెలుగు సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత హిందీతో పాటు తమిళ చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. ప్రస్తుతం 43 ఏళ్ల వయసు కల్గిన ఈయన ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా విద్యుత్ జమ్వాల్ తనకు సంబంధించిన షాకింగ్ ఫొటోలను ట్విట్టవ్ వేధికగా షేర్ చేశారు. అందులో న్యూడ్ ఫొటోలు పెట్టి అందరికీ షాకిచ్చాడు. ముఖ్యంగా హిమాలయకు దగ్గర్లో అడవిలో ఉండి ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా.. స్నానం చేశాడు. అలాగే వంట కూడా చేసుకుంటూ ఫొటోలు దిగాడు. వాటినే ట్విట్టర్ వేధికగా షేర్ చేస్తూ... హిమాలయలకు వెళ్లినట్లు తెలిపాడు. అలాగే 14 సంవత్సరాల క్రితం నుంచి ఇలా ఇక్కడకు రావడం మొదలైందని... ప్రతీ ఏడాది వారం రోజుల నుంచి పది రోజుల పాటు ఇలా ఒంటరిగా గడుపుతానని తెలిపారు.

Ram Gopal Varma Shocking Comments on Hero Nude Photos Check Details

విద్యుత్ జమ్వాల్ షేర్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా ఈ ఫొటోలపై స్పందిస్తున్నారు. తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. అయితే ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సంచలనం సృష్టించే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా ఈ ఫొటోలపై స్పందించారు. ఎవరూ ఊహించని విధంగా కామెంట్లు చేసి మరోసారి ట్రెండింగ్ లో నిలిచారు. అంతగా ఆర్జీవీ ఏం కామెంట్లు చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

విద్యుత్ జమ్వాల్ న్యూడ్ ఫొటోలు పెడుతూ చేసిన పోస్ట్ ను రామ్ గోపాల్ వర్మ ట్యాగ్ చేస్తూ.. అదిరిపోయే కామెంట్లు చేశారు. హేయ్ విద్యుత్ జమ్వాల్... నీవు నీలోని జంతువును పరిచయం చేసేందుకు ఇది సరైన సమయం అని నేను అనుకుంటున్నాని తెలిపారు. ఈ ఫొటోల్లో మీరు అచ్చం గ్రీకు దేవుడిలా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. మీకు శతకోటి వందనాలు అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి. మీరూ ఓసారి ఆర్జీవీ ట్విట్టర్ కు వెళ్తే విద్యుత్ జమ్వాల్ న్యూడ్ ఫొటోలతో పాటు ఆర్జీవీ కామెంట్లను కూడా నేరుగా చూసేయచ్చు.. ఇంకెందుకు ఆలస్యం వెళ్లి ఓసారి చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X