షాకింగ్: మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ! కొత్త సినిమా ప్రకటన

సంచలనాలకు కేంద్రబిందువు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో సినీ, రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టించిన ఆయన.. ఈ సారి 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అంటూ గొడ్డలి పెట్టుకు రెడీ అయ్యాడు. ఇదిలా ఉండగానే తన మరో సినిమా ఇదే అంటూ ఆ సినిమా పేరు ప్రకటించి మరో సంచలనానికి తెర లేపారు వర్మ.

 వివాదాల కోసమే సినిమాలు అన్నట్లుగా

వివాదాల కోసమే సినిమాలు అన్నట్లుగా

ఈ మధ్యకాలంలో సినిమాలే వివాదాలు, వివాదాల కోసమే సినిమాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన తాజా సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రిలీజ్ కాకుండానే మరో సినిమాను అనౌన్స్ చేశారు వర్మ.

మెగా ఫ్యామిలీ అంటూ సంచలనం

మెగా ఫ్యామిలీ అంటూ సంచలనం

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా తర్వాత తాను 'మెగా ఫ్యామిలీ' అనే టైటిల్‌తో ఓ సినిమా తీయబోతున్నానని ప్రకటించాడు వర్మ. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని చెప్పడంతో ఒక్కసారిగా సినీ, రాజకీయ వర్గాలు షాకయ్యాయి. పైగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు (అక్టోబర్) 9 గంటల 30 నిమిషాలకు వెల్లడిస్తానని చెప్పడంతో ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.

Recommended Video

Kamma Rajyam Lo Kadapa Reddlu Trailer || RGV || Sirasri || Ravi Shankar || #KRKRTrailer
మెగా ఫ్యామిలీ రాజకీయాలకు వెండితెర రూపం ఇవ్వనున్నాడా?

మెగా ఫ్యామిలీ రాజకీయాలకు వెండితెర రూపం ఇవ్వనున్నాడా?

ఈ లెక్కన చూస్తే.. ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ద్వారా చంద్రబాబు, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి మెగా ఫ్యామిలీ రాజకీయాలకు వెండితెర రూపం ఇవ్వబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా గురించి వర్మ ఇచ్చే అప్‌డేట్ ఎలా ఉంటుందనేది.

వర్మపై పోలీస్ కేసు.. రాజకీయ ప్రకంపనలు

ఇదిలా ఉంటే గత రెండు రోజుల క్రితమే వర్మ తాజా సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్‌ విడుదల చేసి రాజకీయ ప్రకంపనలు సృష్టించారు వర్మ. యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్ పలు వివాదాలకు ఊతమిచ్చింది. ఈ ట్రైలర్, 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా టైటిల్ విషయమై వర్మపై పోలీస్ కేసు కూడా నమోదైంది.

ఇంతకీ వర్మ టార్గెట్ ఏంటో..!

ఇంతకీ వర్మ టార్గెట్ ఏంటో..!

సీనియర్ డైరెక్టర్, అంతకుమించి ఎంతో మంది క్రియేటివ్ దర్శకులకు గురువు అయిన రామ్ గోపాల్ వర్మ.. ఉన్నట్టుండి ఇలా రాజకీయ నేపథ్యంలో వివాదాస్పద సినిమాలు ఎందుకు తీస్తున్నట్లు? దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర దాగి ఉందా? అనే కోణంలో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. ఇంతకీ వర్మ టార్గెట్ ఏంటి? అనే దానిపై ఆరా దీస్తున్నారు జనం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X