మరో సంచలనానికి రాంగోపాల్ వర్మ రెడీ.. ఆ హీరో కమ్ పొలిటీషియన్‌నే టార్గెట్ చేస్తాడట.!

By Manoj

కొద్ది రోజులుగా వివాదాస్పద చిత్రాలు తెరకెక్కిస్తూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఒకప్పుడు ఈ డైరెక్టర్ మంచి సినిమాలు తీసి అందరి దృష్టిలో పడ్డారు. కానీ, ఇటీవల మాత్రం ఆయన ఎంచుకున్న కథలన్నీ సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలపై ఆర్జీవీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే వీటి ఆధారంగా కొన్ని సినిమాలను కూడా రూపొందించారు. ఇక, తాజాగా ఆయన మరో సంచలనానికి సిద్ధం అయ్యారని ఫిలిం నగర్ ఏరియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

వివాదాస్పదమైనా.. కమ్మగా సక్సెస్ అయ్యాడు

వివాదాస్పదమైనా.. కమ్మగా సక్సెస్ అయ్యాడు

రాంగోపాల్ వర్మ ఇటీవల ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ ఆయన మాత్రం అనుకున్నది తీసి చూపించడంలో సక్సెస్ అయ్యారు. మొదట ఈ సినిమాను ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్డు' అనే టైటిల్‌తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. తర్వాత ఎన్నో హైడ్రామాల మధ్య సినిమా విడుదలైంది.

 వాళ్లపై సినిమా తీస్తానంటూ ప్రకటన

వాళ్లపై సినిమా తీస్తానంటూ ప్రకటన

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్డు' సినిమా విడుదలపై కేఏ పాల్ సహా కొందరు పిటీషన్లు వేయడంతో హైకోర్టు ఈ చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపడంతో వర్మకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. సెన్సార్ బోర్డు మెంబర్ల మీద త్వరలోనే ఓ సినిమా తీస్తానని ప్రకటించారు.

ఆ సినిమాకుసీక్వెల్ ఉంటుంది

ఆ సినిమాకుసీక్వెల్ ఉంటుంది

హైడ్రామాలకు తెర దించుతూ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' విడుదలకు సిద్ధం అయిన సమయంలో రాంగోపాల్ వర్మ కీలక ప్రకటన చేశారు. ‘నా సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా చాలా మంది అడ్డుకున్నారు. ఈ సినిమాకు సీక్వెల్ తీసి వాళ్ల వాళ్లందరికీ సరైన సమాధానం చెబుతాను' అని ఆయన తెలిపారు. దీంతో వర్మ తర్వాతి చిత్రం ఇదేనని ప్రచారం జరిగింది.

మరో సంచలనానికి వర్మ సిద్ధం

మరో సంచలనానికి వర్మ సిద్ధం

ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్', ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన రాంగోపాల్ వర్మ.. మరో సంచలనానికి సిద్ధం అయినట్లు తాజాగా ఓ వార్త ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. ఈ సారి ఆయన టార్గెట్ చేసిన వ్యక్తి పేరు కూడా ప్రచారం అవుతోంది. ఆయనే.. ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.

 అసలు కారణం ఇదేనా.?

అసలు కారణం ఇదేనా.?

రాంగోపాల్ వర్మ.. తన తర్వాతి చిత్రం పవన్ కల్యాణ్‌పై తీస్తారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం పవన్ ఫ్యాన్స్ తనను కెలకడమేనని వర్మ కొందరి దగ్గర అన్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు మాత్రం పవన్ కల్యాణ్ తెలుగు రాష్ట్రాల్లోనే బిగ్ సెలెబ్రిటీ కావడం వల్లే వర్మ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కూడా అంటున్నారు.

ఆయనను చంపడమూ కారణమేనా.!

ఆయనను చంపడమూ కారణమేనా.!

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాలో పవన్ కల్యాణ్‌ను పోలిన వ్యక్తిని చూపించడంతో జనసేన కార్యకర్తలకు మండిపోయింది. దీంతో వాళ్లంతా రాంగోపాల్ వర్మను చంపేశారు. ఈ క్రమంలోనే ఆయన చనిపోయినట్లు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ‘నీమరణం మాకు తీరని లోటు కలిగించాలని, నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి చేకూరకూడదని భగవంతుని ప్రార్ధిస్తున్నాము' అని రాశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X