ఆమెను అరెస్ట్ చేయడానికి స్వర్గానికి వెళ్లారా? : రామ్ గోపాల్ వర్మ సెటైర్లు..
Allu Arjun- Ram Gopal Varma: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ఇండస్ట్రీనే కాకుండా సినీ అభిమానులను షాక్ కు గురయ్యేలా చేసింది. ఈ ఘటనపై కొంతమంది ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా, కొందరు మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్‌ని సమర్ధిస్తూ పోస్ట్‌లు చేశారు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.
పుష్ప 2 సినిమా ప్రిమియర్ షో సందర్భంగా హీరో అ్లల్లు అర్జున్.. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వెళ్లారు. ఈ క్రమంలో భారీ మొత్తం ఫ్యాన్స్ చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో రేవంతి అనే మహిళ అభిమాని ప్రాణాలు కోల్పోయారు. ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితి ఉన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ను శుక్రవారం నాడు హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ పై 105, 118(1), రెడ్ విత్ 3/5, బి ఎం ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులోను అల్లు అర్జున్ కు షాక్ తగిలింది. కానీ, మధ్యంతర బెయిల్ మంజూర్ చేశారు. కానీ, అయితే బెయిల్ ఉత్తర్వుల జారీ ఆలస్యం కావడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు.
అల్లు అర్జున్ విడుదల అయిన తరువాత పరామర్శించడానికి సినీ, రాజకీయ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ కు సంఘీభావం తెలుపుతూ బన్నీకి మద్దతును ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ .. అల్లు అర్జున్ కు సపోర్టుగా నిలుస్తూ.. పోలీసులకు వ్యతిరేకంగా స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా(X) వేదికగా స్పందిస్తూ మరో ఇంట్రెస్టింగ్ ట్విట్ చేశారు.

తాజాగా వర్మ ట్వీట్‌లో.. అల్లు అర్జున్ అరెస్ట్‌ని ప్రతి నటుడు వ్యతిరేకించాల్సిందే. ఏ ఫిల్మ్ స్టార్ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకోవడం నేరమా ? అంటూ నిలదీశారు. క్షణ క్షణం సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ శ్రీదేవిని చూసేందుకు లక్షలాది మంది వచ్చారు. ఆ సమయంలో ముగ్గురు చనిపోయారు. ఈ ఘటనపై తెలంగాణ పోలీసులు .. శ్రీదేవిని అరెస్ట్ చేసేందుకు స్వర్గానికి వెళ్తారా? అంటూ ప్రశ్నించారు. పాపులారిటీ ఎక్కువ ఉన్న సెలబ్రిటీ విషయంలో ఇలాంటివి గతంలో జరిగాయి, అప్పుడు స్పందించని పోలీసులు ఇప్పుడు ఎందుకు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనేది రామ్ గోపాల్ వర్మ ప్రశ్న.
అంతకుముందు కూడా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీస్ట్ .. తెలంగాణ పోలీసులకు, అధికారులకు దిమ్మతిరిగిపోయేలా నాలుగు ప్రశ్నలు వేశారు. అందులో 1. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలలాంటి వేడుకుల్లో తోపులాటల్లో భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా? 2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా పోతే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తారా? 3. ప్రీరిలీజ్ ఫంక్షన్స్‌లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? 4. భద్రత ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు? అంటూ ఆర్జీవి దిమ్మతిరిగే ప్రశ్నలు వేశారు. రామ్ గోపాల్ వేసిన ప్రశ్నలు నెట్టింట వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











