మహేష్ బాబు బర్త్ డేపై రామ్ గోపాల్ వర్మ కౌంటర్.. కులపిచ్చి అంటూ సంచలన వ్యాఖ్యలు
సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న (శుక్రవారం) 44వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్బంగా మహేష్ ఫ్యాన్స్, సినీ ఇండస్ట్రీ అంతా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తించారు. మహేష్ పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక డీపీని సైతం తయారు చేసి దానికి తెగ వైరల్ చేసేశారు. ఇదంతా బాగానే ఉన్నా మహేష్ బాబు బర్త్ డే రోజే రామ్ గోపాల్ వర్మ వేసిన కౌంటర్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఇంతకీ వర్మ ఏమన్నాడు? అలా ఎందుకు అనాల్సి వచ్చింది? వివరాల్లోకి పోతే..

వర్మకు అలవాటేగా.. ఆయన స్టైల్‌లోనే
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వర్మకు అలవాటే. ఎవ్వరు ఎలా రియాక్ట్ అయినా ఫర్వాలేదు తాను చెప్పాలనుకున్నది నిర్మొహమాటంగా చెప్పేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఈ కోవలోనే తనదైన స్టైల్‌లో మహేష్ బాబు బర్త్ డే రెస్పాన్స్‌పై సంచలన ట్వీట్ చేశాడు. మహేష్ బాబు బర్త్ డే వచ్చిన స్పందన అనేది తన సినిమా పాటకు వచ్చిన స్పందన ముందు నిలవలేక పోయిందని కౌంటర్ వేశాడు వర్మ.

మహేష్ ఇంట్రోతో పాటు తన సినిమా పాట
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ఆయన కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మరోవైపు అదే సమయానికి రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' సినిమాకు సంబంధించిన ఓ పాట రిలీజ్ చేశాడు. మహేష్ బాబు ఇంట్రో, ఆర్జీవీ పాట ఒకేసమయంలో యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యాయి.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. ఊహించని విధంగా
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న చిత్రమే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. వాస్తవానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించారు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వలేదు. కానీ, ఊహించని విధంగా శుక్రవారం ఉదయం ఈ సినిమా పాటను విడుదల చేశారు వర్మ.
మహేష్ బాబుకు కౌంటర్ వేస్తూ వర్మ సంచలనం.. కులపిచ్చి
ఈ నేపథ్యంలో మహేష్ సరిలేరు నీకెవ్వరు ఇంట్రోతో తన పాటను పోల్చుతూ, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ పై సెన్సేషనల్ ట్వీట్ చేశాడు వర్మ. ''కమ్మరాజ్యంలో కడపరెడ్లు పాట ట్రెండింగ్ నెంబర్ 2లో ఉంది. అదే మహేష్ పుట్టినరోజు పైగా ఆయన కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ఇంట్రో ట్రెండింగ్‌లో లేదు. రెండూ ఒకేసారి రిలీజ్ అయినా కూడా జనం సూపర్ స్టార్స్ కంటే కులపిచ్చి మీదే ఎక్కువ ఇంటస్ట్ర్ చూపించారు. దటీజ్ వెరీ బ్యాడ్'' అని వర్మ పేర్కొన్నాడు.

సరిలేరు నీకెవ్వరు మూవీ
మహేష్ బాబు హీరోగా ఆయన కెరీర్ లో 26 వ సినిమాగా రూపొందుతోంది సరిలేరు నీకెవ్వరు మూవీ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్ టైనర్‌లో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది.


Click it and Unblock the Notifications











