VYOOHAM: పవన్‌కు బాబు ప్యాకేజ్.. మెగా ఫ్యామిలీని లాగుతూ.. షాకింగ్‌గా వ్యూహం ట్రైలర్
ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ సమయంలోనే సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు రాంగోపాల్ వర్మ. అలా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న ఆయన.. ఎన్నో గొప్ప చిత్రాలను తెరకెక్కించాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఈ క్రేజీ డైరెక్టర్ వివాదాస్పద సినిమాలనే చేస్తూ టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్న రాంగోపాల్ వర్మ ఇప్పుడు 'వ్యూహం' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే.

'అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం' అనే కాన్సెప్టుతో నిజమైన అంశాలతో 'వ్యూహం' చిత్రాన్ని తీస్తున్నట్లు వర్మ గతంలోనే ప్రకటించాడు. అందుకు తగ్గట్లుగానే దీన్ని వివాదాస్పద కంటెంట్‌తో తీస్తున్నాడు. ఈ మూవీని డిసెంబర్ 29న రిలీజ్ చేస్తుండడంతో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
తాజాగా వచ్చిన 'వ్యూహం' రెండో ట్రైలర్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్‌మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్రకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. అలాగే, మెగా ఫ్యామిలీలో జరిగిన చర్చలను కూడా ప్రస్తావించిన సీన్స్ పెట్టారు. అంతేకాదు, పవన్ కల్యాణ్‌కు బాబు ప్యాకేజ్ ఇస్తానని చెప్పిన మాటలను కూడా ఈ ట్రైలర్‌లో హైలైట్ చేశారు.

మొత్తంగా 'వ్యూహం' మూవీ ట్రైలర్‌ను చూస్తుంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచే సన్నివేశాలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఉండే ఎన్నో సీన్స్ కనిపించాయి. ఎక్కువగా పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసే సన్నివేశాలను పెట్టి కలకలం రేపాడు. దీంతో ఈ ట్రైలర్‌కు మిశ్రమ స్పందన లభిస్తుందని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'వ్యూహం' మూవీలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్‌కు కూడా వెళ్లొచ్చింది.


Click it and Unblock the Notifications











