VYOOHAM: వాడో పిల్లబిత్రేగాడు.. చంద్రబాబు, పవన్ మధ్య చిచ్చు.. వ్యూహం ట్రైలర్‌లో ఆ స్కాం కూడా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు గొప్ప గొప్ప చిత్రాలను చేసి.. ఈ మధ్య కాలంలో వరుసగా కాంట్రవర్శీ మూవీలతోనే వస్తున్నాడు సంచలనం దర్శకుడు రాంగోపాల్ వర్మ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఫోకస్ చేస్తూ.. ఎన్నో సున్నితమైన అంశాలతో సినిమాలు చేస్తున్నాడు. అందులోనూ అక్కడి అధికార పార్టీకి మద్దుతుగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వర్మ వరుసగా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు సరికొత్తగా 'వ్యూహం' అనే ఫిల్మ్‌ను చేస్తున్నాడు.
సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న చిత్రమే 'వ్యూహం'. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెత్ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. 'అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం' అనే కాన్సెప్టుతో నిజమైన అంశాలతో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు వర్మ గతంలోనే ప్రకటించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

తాజాగా వచ్చిన 'వ్యూహం' ట్రైలర్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్‌మోహన్ రెడ్డి విషయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరును చూపించారు. ఆ తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎదురైన కఠిన సమస్యలు, అప్పటి అధికారి పార్టీ నాయకుల తీరు, అలాగే, ప్రతిపక్ష పార్టీ నాయకులను ఇందులో హైలైట్ చేశారు. చివర్లో ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన జగన్‌ను చూపించారు.
ఇందులో జగన్‌మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలనే కాకుండా.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు మధ్య కొన్ని అంశాలను కూడా వర్మ సెటైరికల్‌గా ప్రస్తావించాడు. వాళ్లిద్దరి మధ్య చిచ్చు పెట్టేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా 'ఆ కల్యాణ్‌కు మిత్రుడు ఎవరో శత్రువు ఎవరో గుర్తించే తెలివి లేదు' అని చెప్పే డైలాగ్‌ను హైలైట్ చేశారు. అలాగే, గాజు గ్లాస్‌ను వదిలేయడాన్ని కూడా చూపించాడు.
'వ్యూహం' మూవీ ట్రైలర్ చివర్లో చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ స్కాం టాపిక్ కూడా వచ్చింది. ఇలా ఇది మొత్తంగా చూస్తుంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచే సన్నివేశాలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఉండే ఎన్నో సీన్స్ కనిపించాయి. ఇక, ఈ ట్రైలర్ చూసి ఓ వర్గం వాళ్లు సంతోషిస్తుండగా.. మరో వర్గం నుంచి మాత్రం వ్యతిరేకత వస్తోంది.
ఇదిలా ఉండగా.. రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న 'వ్యూహం' మూవీలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 10న విడుదల కాబోతుంది.


Click it and Unblock the Notifications











