ఒకేరోజు హీరో రామ్ కార్తీక్ రెండు సినిమాలు.. రాయ్ లక్ష్మితో కలిసి
సాధారణంగా సినిమా పరిశ్రమలో ఒకే రోజు ఒక హీరో నటించిన రెండు సినిమాలు రిలీజ్ కావడం చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితి, అవకాశం యువ హీరో రామ్ కార్తీక్‌కు దక్కింది. ఆయన నటించిన వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ, మౌనమే ఇష్టం సినిమాలు మార్చి 15న రిలీజ్ కానున్నాయి.
ప్రముఖ గ్లామర్ తార రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ చిత్రంలో రామ్ కార్తీక్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. పూజిత పొన్నడా హీరోయిన్‌గా నటించింది. కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హారర్, కామెడీగా రూపొందింది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి.

ఇక రామ్ కార్తీక్ నటించిన రెండో చిత్రం మౌనమే ఇష్టం. ఈ చిత్రానికి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, దాదాపు 150 సినిమాలకు పనిచేసిన అశోక్ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రంలో పార్వతి అరుణ్, రీతూ చౌదరీ హీరోయిన్లుగా నటించారు. ఏడాదికి ఒక్క చిత్రం చేస్తున్న హీరోలను పక్కన పెడితే.. యువ హీరో రామ్ కార్తీక్ నటించిన రెండు చిత్రాలు ఒకే రోజున విడుదల కావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











