హీరో రామ్ మల్టీస్టారర్ చిత్రం.. మరో హీరో ఎవరంటే!
హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం హలొ గురు ప్రేమ కోసమే. నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావు నక్కిన దర్శత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది. నేను శైలజ తరువాత హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ ఈ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. ఇదిలా ఉండగా రామ్ గురించి మరో క్రేజీ న్యూస్ ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టాలీవడ్ లో బయోపిక్, మల్టీస్టారర్స్ చిత్రాల హవా కొనసాగుతోంది. రామ్ కూడా ఓ మల్టీస్టారర్ సినిమా కోసం రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ పెదనాన్న స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రంలో నటించే మరో నటుడు తమిళ హీరో అని వార్తలు వస్తున్నాయి.

ఇటీవల మంచి విజయం అందుకున్న దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











