భాగ్యశ్రీ భోర్సేతో అలా మొదలైంది.. హీరోయిన్‌తో ప్రేమాయణంపై రామ్ షాకింగ్ కామెంట్స్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. పీ. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ సినిమా సమయంలో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేతో రామ్ ప్రేమాయణం సాగిస్తున్నాడని గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ ఇష్యూపై రామ్ పోతినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఉపేంద్ర కీలక పాత్ర
ఆంధ్రా కింగ్ తాలూకాలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషిస్తున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, తులసి, సింధు తులానీ, రాహుల్ రామకృష్ణ, సత్య, వీటీవీ గణేష్‌లు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్.. సిద్ధార్ధ నూని, జార్జ్ సీ విలియమ్సన్ సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. వివేక్- మెర్విన్‌లు సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

హాట్ టాపిక్‌గా రామ్- భాగ్యశ్రీ రిలేషన్?
కెరీర్‌లో చాలా మంది హీరోయిన్లతో వర్క్ చేసినప్పటికీ రామ్ గురించి పెద్దగా ఎలాంటి రూమర్స్ రాలేదు. అలాంటిది భాగ్యశ్రీ భోర్సేతో ఆయన డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రావడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. దీనికి కారణాలు లేకపోలేదు. రామ్, భాగ్యశ్రీలు పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలలో బ్యాక్‌గ్రౌండ్, వస్తువులు ఒకేలా ఉండటంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందన్న రూమర్స్‌కు బలం చేకూరేలా చేశాయి. ఇక ఎన్నడూ లేని విధంగా రామ్ పోతినేని రచయితా మారి ఈ సినిమా కోసం ఓ సాంగ్ కూడా రాశాడు. ఇది భాగ్యశ్రీని ఉద్దేశించి రాసినదేనని గాసిప్స్ వైరల్ అయ్యాయి.
రామ్‌ను లవ్ యూ అనేసిన భాగ్యశ్రీ
ఇక రెండ్రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రా కింగ్ తాలూకా మ్యూజిక్ కాన్సర్ట్‌లో భాగ్యశ్రీ మాట్లాడుతూ.. రామ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. మీరు కింగ్ ఆఫ్ హార్ట్స్... ఐ లవ్ యూ అంటూ అందరిముందు ఓపెన్ అయ్యింది. దాంతో భాగ్యశ్రీ - రామ్‌ల మధ్య ఏదో జరుగుతుందని జనాలు ఫిక్స్ అయ్యారు. ఇంత జరుగుతున్నా రామ్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది. తాజాగా భాగ్యశ్రీ భోర్సేతో ప్రేమాయణంపై రామ్ పోతినేని స్పందించారు. ఆంధ్రా కింగ్ తాలూకా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడారు.
భాగ్యశ్రీ అలా మొదలైంది
ఈ సందర్భంగా 16 ఏళ్లకే కెరీర్ ప్రారంభించారు, చాలామంది హీరోయిన్స్‌తో వర్క్ చేశారు. ఇప్పటి వరకు మీ గురించి ఒక్క రూమర్ లేదు.. కానీ ఈ ఫిల్మ్‌కు ఎందుకో రూమర్స్ బయటికొచ్చాయని ఓ విలేకరి ప్రశ్నించారు. దీనికి రామ్ స్పందిస్తూ.. ఈ సినిమాకు పాట రాసినప్పటి నుంచి ఇది స్టార్ట్ అయ్యింది. లేకపోతే ఎందుకు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు పాట రాయలేదు, ఫస్ట్ టైం పాట రాశా. ఈ సాంగ్ రాసేసరికి హీరోయిన్ ఎంపిక కూడా జరగలేదని రామ్ తెలిపారు. దాంతో భాగ్యశ్రీ భోర్సేతో తాను డేటింగ్ చేస్తున్నట్లుగా వస్తున్న ఊహాగానాలకు రామ్ పోతినేని చెక్ పెట్టినట్లయ్యింది.


Click it and Unblock the Notifications











