BoyapatiRAPO: ముందుగానే రామ్ సినిమా రిలీజ్.. బోయపాటి మార్క్ లేకుండానే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కొందరు హీరోలు, దర్శకుల కాంబినేషన్లపై ప్రత్యేకమైన ఫోకస్ ఉంటుంది. అలా ఈ మధ్య కాలంలో చాలా స్పెషల్ కాంబోల్లో ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కలిసి సినిమా చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబోలో మూవీ ప్రకటించగానే అందరి దృష్టి దీనిపైనే పడింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీంతో దీనిపై హైప్ అంతకంతకూ పెరుగుతూనే వెళ్తోంది.
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించే సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి వీలు కుదిరినప్పుడల్లా దీన్ని చేస్తూ వస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ చాలా భాగాన్ని కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ చిత్రం క్లైమాక్స్ పార్టును షూట్ చేసినట్లు హీరో రామ్ పోతినేని సోషల్ మీడియాలో చెప్పాడు. ఇక, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకునేలా ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు.

పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, అప్పుడు 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వర్రావు', 'లియో' మూవీలు విడుదల కాబోతున్నాయి. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా రామ్ సినిమాను ఒక నెల ముందుగానే తీసుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15వ తేదీనే విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు బోయపాటి మార్క్ లేకుండానే డీసెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇక, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తోన్న సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీ నుంచి ఇటీవలే ఓ వీడియో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో పాటు అంచనాలు భారీగా పెరిగాయనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











