RAPO20: రామ్ పోతినేనికి పవర్ ఫుల్ విలన్ గా యంగ్ హీరో.. బోయపాటి శ్రీను స్కెచ్ మాములుగా లేదుగా!

దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల రెడ్, ది వారియర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అవి అంతగా విజయాన్ని అందించలేకపోయాయి.

అయితే ఇప్పుడు మంచి హిట్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు రామ్. ఈ క్రమంలోనే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ పోతినేని. ఇక బోయపాటి విలన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా ఒక యంగ్ హీరోను తీసుకోనున్నారట.

స్టార్టింగ్ లోనే హిట్స్..

స్టార్టింగ్ లోనే హిట్స్..

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే స్టార్లుగా ఎదిగి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన రామ్ పోతినేని ఒకరు.వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన 'దేవదాసు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. అదే సమయంలో హ్యాండ్సమ్ లుక్స్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సత్తా చాటాడు.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా..

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా..

లవర్ బాయ్ గా ముద్ర వేసుకున్న టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రామ్ పోతినేని డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ద్వారా చాలా కాలం తర్వాత హిట్ ట్రాక్ ఎక్కాడు రామ్ పోతినేని. పక్కా మాస్ మసాల కథతో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. అదే సమయంలో రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో అతడి కెరీర్ మారిపోయింది.

మంచి హిట్ అందుకోవాలని..

మంచి హిట్ అందుకోవాలని..

అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్ సినిమాలు రామ్ పోతినేనికి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి. రామ్ కెరీర్ లో మొదటి బైలింగువల్ ప్రాజెక్ట్ అయిన లింగుస్వామి దర్శకత్వంలో హీరోయిన్ కృతీశెట్టి నటించిన ది వారియర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో తర్వాతి సినిమాతో మంచి హిట్ అందుకోవాలని ఆరాటాపడుతున్నాడు ఈ ఎనర్జిటిక్ స్టార్. రామ్ తన తర్వాతి సినిమాను బోయపాటి శ్రీనుతో చేస్తున్న విషయం తెలిసిందే.

విలన్స్ గా ఫ్యామిలీ హీరోలు..

విలన్స్ గా ఫ్యామిలీ హీరోలు..

ఇక బోయపాటి శ్రీను సినిమాల్లో విలన్లకు ఇచ్చే ఇమేజ్ మాములుగా ఉండదు. ఎందుకంటే ఆయన చిత్రాల్లో ప్రతినాయకున్ని చాలా పవర్ ఫుల్ గా చూపిస్తారు బోయపాటి శ్రీను. లెజెండ్ సినిమాతో ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ ఉన్న జగపతి బాబును విలన్ గా మార్చేశారు. ఆ తర్వాత మరో ఫ్యామిలీ హీరో అయిన శ్రీకాంత్ ను బాలకృష్ణ అఖండ సినిమాతో పరిచయం చేశారు. ఇప్పుడు మరొక సాఫ్ట్ హీరోను రామ్ పోతినేని చిత్రంలో విలన్ గా చూపించనున్నారట బోయపాటి శ్రీను.

విలన్ గా యంగ్ హీరో..

విలన్ గా యంగ్ హీరో..

రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న RAPO20 చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ది వారియర్ సినిమా తర్వాత రామ్ తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఈ మూవీలో విలన్ గా సెలక్షన్ ఇటీవల పూర్తయిందని సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ లో ప్రతినాయకుడిగా యంగ్ హీరో ప్రిన్స్ ను పరిచయం చేయనున్నారు.

సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో..

సపోర్టింగ్ క్యారెక్టర్స్ తో..

డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన నీకు నాకు డ్యాష్ డ్యాష్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యాడు ప్రిన్స్. తర్వాత బస్ స్టాప్ సినిమాతో హిట్ కొట్టాడు. అనంతరం కొన్ని సినిమాలు చేసిన హిట్టు కాలేదు. పలు చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశాడు. ఇటీవల డీజే టిల్లు చిత్రంలో కాస్తా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు ప్రిన్స్. ఇటీవల ది అమెరికన్ డ్రీమ్ సినిమా కూడా చేశాడు. RAPO20 చిత్రంలో రామ్ కు ధీటుగా సరికొత్త క్యారెక్టరైజేషన్ తో ప్రిన్స్ ను చూపించనున్నాడట బోయపాటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X