Skanda: గూస్ బంప్స్ తెప్పించే బీజీఎంతో రామ్ పోతినేని 'స్కంద'.. అదిరిపోయిన టైటిల్ గ్లింప్స్
టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ది వారియర్ సినిమాతో ప్లాప్ తెచ్చుకున్న రామ్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగానే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. RAPO20 వర్కింగ్ టైటిల్ తో ప్రచారమైన ఈ సినిమా టైటిల్ ను గ్లింప్స్ విడుదలతో ప్రకటించారు. ఆ విశేషాలు ఓసారి చూద్దాం.
సినీ కెరీర్ స్టార్టింగ్ లోనే దేవదాస్ తర్వాత జగడం, రెడీ, మస్కా వంటి చిత్రాలతో విజయం సాధించాడు రామ్ పోతినేని. హ్యాండ్సమ్ లుక్స్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణించాడు రామ్ పోతినేని. ఎక్కువగా లవర్ బాయ్ స్టోరీలు చేసిన రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరోగా మారిపోయాడు. ఇప్పుడు మరింత మాస్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న రామ్ సినిమా RAPO20. తాజాగా ఈ సినిమా టైటిల్ ను గ్లింప్స్ వీడియో ద్వారా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
RAPO20 సినిమాకు ముందు నుంచి ప్రచారంలో ఉన్న స్కంద (Skanda Movie) పేరును పెట్టారు. టైటిల్ రిలీజ్ గ్లింప్స్ వీడియో మాస్ ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. ఇందులో రామ్ పోతినేని వైట్ షర్ట్, వైట్ పంచ కట్టుకుని నీళ్లలో అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చాడు. మీరు దిగితే ఊడేది ఉండదు.. నేను దిగితే మిగిలేది ఉండదు అని పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ను రక్తి కట్టించారు. నీళ్లలోని ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది.

స్కంద మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అయ్యే సంస్కృతం పదాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక తమన్ అందించిన బీజీఎమ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోలకు ఎలా ఆయుధం ఉంటుందో.. స్కందలో కూడా రామ్ పోతినేనికి ఓ వెపన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్కంద అంటే అటాకర్ అని అర్థం వస్తుంది. దీన్నే టైటిల్ కు క్యాప్షన్ గా పెట్టారు. కాగా ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా, ప్రిన్స్ సిసిల్ విలన్ గా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











