RAPO20: దసరా బరిలో రామ్ పోతినేని మూవీ.. ఆ స్టార్ హీరోతో గట్టి పోటీ.. ఆరోజే విడుదల!

మొదట్లో లవర్ బాయ్ గా ముద్ర వేసుకున్న టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రామ్ పోతినేని డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ద్వారా మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్ సినిమాలు రామ్ పోతినేనికి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయాయి.

దీంతో తర్వాత సినిమాపై చాలా ఫోకస్ పెట్టాడు రామ్ పోతినేని. అందుకే మాస్ డైరెక్టర్ గా పేరొందిన బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వదిలారు మేకర్స్.

రాని ఒక్క అప్డేట్..

రాని ఒక్క అప్డేట్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ RAPO20. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ది వారియర్ సినిమా తర్వాత రామ్ తో ఆయన నిర్మిస్తున్న చిత్రమిది.

అయితే ఈ సినిమా కోసం, అప్డేట్స్ కోసం రామ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభమై 8 నెలలు కావొస్తున్న ఇప్పటికీ ఒక్క అప్డేట్ రాలేదు. కానీ తాజాగా ఇచ్చిన అప్డేట్ ఫ్యాన్స్ కు మంచి హైప్ ఇచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది.

సెకండ్ ఇన్నింగ్స్..

సెకండ్ ఇన్నింగ్స్..

రామ్ పోతినేని సినీ కెరీర్ లోనే తొలి సారిగా పాన్ ఇండియా మూవీగా వస్తున్న చిత్రం RAPO20.భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక రామ్ సరసన బ్యూటిఫుల్ అండ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది.

ఇక ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో యంగ్ హీరో ప్రిన్స్ సిసిల్ ను ఓకే చేసినట్లు సమాచారం. అలాగే హోమ్లీ బ్యూటి మీరా జాస్మిన్ ఈ మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనునందని టాక్.

వీర మాస్ లుక్ లో..

వీర మాస్ లుక్ లో..

ఇదిలా ఉంటే రామ్-బోయపాటి కాంబినేషన్ లో తొలిసారిగా వస్తున్న RAPO20 మూవీని ఈ ఏడాది దసరా బరిలో ఉంచనున్నారు. తాజాగా దీనికి సంబంధించి రిలిజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఈ సినిమాను అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్టర్ లో రామ్ పోతినేని వీర మాస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. పోట్ల గిత్తను పట్టుకుని లాక్కుని రామ్ వెళ్తున్న ఈ పోస్టర్ అదిరిపోయింది.

విజయ్ తో పోటీ..

విజయ్ తో పోటీ..

ఇప్పటివరకు తెలుగు, తమిళంపై దృష్టి పెట్టిన రామ్ RAPO20 సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ పై ఫోకస్ పెట్టాడు. ఇక ఆయన హిందీ డబ్బింగ్ చిత్రాల ద్వారా నార్త్ ప్రేక్షకులకు కూడా రామ్ సుపరిచతమే. అయితే ఈ సినిమా విడుదల అవుతున్న అదే అక్టోబర్ నెలలో 19న విక్రమ్ ఫేమ్ లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబో పాన్ ఇండియా మూవీ లియో (LEO) విడుదల కానుంది.

విజయ్ కు ఇక్కడ మార్కెట్ బాగానే ఉండగా.. లోకేష్ కు మంచి ఫేమ్ వచ్చింది. ప్రస్తుతానికి ఈ ఏడాది దసరాకు రామ్ పోతినేని, విజయ్ సినిమాలు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది.

పవర్ ఫుల్ విలన్ గా..

పవర్ ఫుల్ విలన్ గా..

ఇక బోయపాటి శ్రీను సినిమాలో విలన్స్ ను ఎలా చూపిస్తారో తెలిసిందే. అఖండతో భారీ విజయాన్ని అందుకున్న బోయపాటి RAPO20 సినిమాతో మరో సక్సెస్ చూసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అందుకే ఇందులో భారీ తారగాణాన్ని ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే యంగ్ హీరో ప్రిన్స్ సిసిల్ ను పవర్ ఫుల్ విలన్ గా చూపించనున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X