మళ్ళీ అతన్నే నమ్ముకున్న ఎనర్జిటిక్ స్టార్.. కొత్త సినిమా కన్ఫర్మ్ చేసేశాడు

కెరీర్‌లో సరైన హిట్ లేక కాస్త తడబడిన ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామ్ స్టామినా ఏంటో తెలుపుతూ, భారీ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో అదే జోష్‌లో దీపావళి రోజున తన కొత్త సినిమాను కన్ఫర్మ్ చేసేశాడు హీరో రామ్.

రామ్ కెరీర్‌లో 18వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను తన హోం బ్యానర్ స్రవంతి మూవీస్‌ పతాకంపై తెరకెక్కించనున్నారు రామ్. కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్‌ జోడిగా నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మలను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Ram Pothineni Confirmed His New Movie

తమిళంలో సూపర్‌ హిట్ సాధించిన తడం సినిమాకు రీమేక్‌‌గా ఈ సినిమా రాబోతోంది. మాస్టర్ వర్షన్ అరుణ్‌ విజయ్‌ హీరోగా నటిస్తూ ద్విపాత్రాభినయం పోషించాడు. ఈ రీమేక్‌లో రామ్ హీరోగా నటించబోతున్నాడు. ఈ చిత్రంతో రామ్ తన కెరీర్‌లో మొదటిసారి డబుల్ యాక్షన్ చేయబోతున్నాడు. ఇక రామ్ గత సినిమాలు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలను తెరకెక్కించిన కిశోర్‌ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం ఆసక్తికర అంశంగా మారింది.

గతంలో రామ్‌కి హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల..ఈ సారి ఎంతమేర సక్సెస్ ఇస్తాడు అనే దానిపై చర్చలు నడుస్తున్నాయి. కాగా ఈ రోజు సోమవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X