The Warriorr మూవీ రిలీజ్‌కు సమస్యలు.. అయినా మా నమ్మకాన్ని ప్రేక్షకుల నిలబెట్టారు.. రామ్ పోతినేని ఎమోషనల్

ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ సత్య‌గా యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన ది వారియర్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. కృతి శెట్టి హరోయిన్‌గా ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన ఈ చిత్రానికి తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సక్సెస్ మీట్‌లో నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, చిత్ర సమర్పకులు పవన్ కుమార్, ఫైట్ మాస్టర్ విజయ్, కళా దర్శకుడు డి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఉస్తాద్ రామ్ మాట్లాడుతూ..

 చివరి నిమిషం వరకు కష్టాలే..

చివరి నిమిషం వరకు కష్టాలే..


సినిమా విడుదల సమయంలో వర్షాలు ఉన్నాయి. అడ్డంకులు చాలా వచ్చాయి. లాస్ట్ మినిట్ డిజిటల్ ప్రింట్స్వెళ్ళే వరకూ ఏదో ఒక సమస్య ఎదురైంది. మా టీమ్ అంతా వారియర్స్‌లా నిలబడి చివరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అదే పెద్ద సక్సెస్ అనుకున్నా. అలాంటి సమయంలో ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా విడుదల చేయాలా? వద్దా? అనే సందేహం వస్తుంది. కొవిడ్ వచ్చినా... వర్షాలు వచ్చినా... ఏం వచ్చినా... థియేటర్లకు వస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సినిమా లవర్స్ అని 'ది వారియర్' మరోసారి ప్రూవ్ చేసింది అని రామ్ చెప్పారు.

 వాయిదా వేద్దామని అనుకొని..

వాయిదా వేద్దామని అనుకొని..


వర్షాలు చూసి సినిమా వాయిదా వేయాలా? అనే ఆలోచనలో పడ్డాం. కానీ, మేం గట్టిగా నమ్మాం. ప్రేక్షకులు వస్తారని అనుకున్నాం. ఫస్ట్ డే అదే ప్రూవ్ అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలకారణంగా కొంత మందిప్రేక్షకులు సినిమా చూడలేకపోయారు. వాళ్ళందరూ కూడా సినిమా చూడాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతల గురించి చెప్పాలి. అందరూ అనుకుంటున్నట్టునేనూనెక్స్ట్ సినిమా వాళ్ళకు చేస్తున్నాను. లింగుస్వామి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. 'ది వారియర్'తో కృతి అందరికీ బేబీ అయిపోయింది. ఆది పినిశెట్టి ప్రాణం పెట్టి సినిమా చేశారు అని రామ్ పోతినేని అన్నారు.

రామ్, ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్ సూపర్

రామ్, ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్ సూపర్


కృతి శెట్టి మాట్లాడుతూ.. డాక్టర్లలో ఒక క్యూట్ నెస్ ఉంటుంది. వాళ్ళు ప్యూర్. ఆ క్యూట్ నెస్ రామ్ బాగా క్యారీ చేశారు. పోలీస్ లో ఉన్న పర్ఫెక్షన్ కూడా బాగా క్యారీ చేశారు. ఆయనతో నటించడం బాగుంది. గురు పాత్రలో ఆది పినిశెట్టినితప్ప ఇంకొకరిని ఊహించలేం. లింగుస్వామి గారికి థాంక్స్. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశంఇచ్చారు. మా నిర్మాతలు పవన్ కుమార్, శ్రీనివాసా చిట్టూరితో మళ్ళీ మళ్ళీ పని చేయాలనుందని లింగుస్వామి గారు చెప్పారు. నేనూఅదే అనుకున్నాను. వాళ్ళ నిర్మాణంలో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఐయామ్ సో హ్యాపీ. ఎప్పుడూపాజిటివ్ గా ఉండే పవన్ కుమార్, శ్రీనివాసా చిట్టూరి గారికి థాంక్స్. మా సినిమానుహిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అని అన్నారు.

 ది వారియర్ పక్కా కమర్షియల్ సినిమా

ది వారియర్ పక్కా కమర్షియల్ సినిమా


ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ప్రేక్షకులు అందరికీథాంక్స్. పక్కా కమర్షియల్ సినిమాలు ఏమేం కావాలో అవన్నీ ది వారియర్‌లో ఉన్నాయనిప్రేక్షకులు చెబుతున్నారు. చూసిన వారంతా బావుందని అంటున్నారు. పాజిటివ్ రివ్యూస్వచ్చాయి. వర్షాల్లోసినిమా విడుదలైనా ఓపెనింగ్స్బాగా వచ్చాయి. తర్వాత రోజు మరింత పికప్ అయ్యింది. ప్రేక్షకులకు థాంక్స్. గురు గురించి అందరూ మాట్లాడుతున్నారంటే దానికి కారణం గురు లింగుస్వామి. కమర్షియల్ సినిమాలకుఆయన ల్యాండ్ మార్క్. ఆయన చేసిన ప్రతి సినిమా చూసి ఉంటారు. ఆడియన్స్ పల్స్ తెలుసుకునిషూట్ చేస్తారు. బ్రదర్ రామ్, కృతి... అందరితోనటించడం వండర్ ఫుల్ఎక్స్‌పీరియ‌న్స్‌ అని అన్నారు.

నిర్మాతలతో మళ్లీ మళ్లీ పనిచేస్తా

నిర్మాతలతో మళ్లీ మళ్లీ పనిచేస్తా


ది వారియర్ లాంటి మంచి చిత్రంలోనాకు అవకాశం ఇచ్చిన మా నిర్మాతలు పవన్ కుమార్, శ్రీనివాసా చిట్టూరి గారికి థాంక్స్. అందరూ చెబుతున్నట్టుమళ్ళీ మళ్ళీ చేయాలనిపించేఒక ప్రొడక్షన్ హౌస్ ఇది. వాళ్ళతోనా రెండో చిత్రమిది. చాలా ఖర్చు పెట్టి, ఎక్కడాకాంప్రమైజ్ కాకుండా సినిమా తీశారు అని ఆది పినిశెట్టి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X