Skanda: నువ్వేమైనా ఫిగర్ అనుకుంటున్నావా? శ్రీలీలకు షాకిచ్చిన రామ్ పోతినేని
టాలీవుడ్‌లో ఇప్పుడు ఆడియెన్స్ అటెంక్షన్‌ను లాక్కున్న చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన 'స్కంద' ఒకటి. ఫుల్ లెంగ్త్ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించారు.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రాబోతున్న 'స్కంద' సినిమాకు సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే పూర్తైంది. ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, 'సలార్' వాయిదా పడడంతో దీన్ని కూడా సెప్టెంబర్ 28న తేదీకి పోస్ట్‌పోన్ చేసుకున్నారు. దీంతో చిత్ర యూనిట్ దీనికి తగ్గ ఏర్పాట్లను చకచకా చేసుకుంటోంది.

'స్కంద' మూవీ రిలీజ్‌కు సమయం ఆసన్నం అవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేసింది. ఇందులో భాగంగానే ప్రముఖ యాంకర్ సుమ కనకాలతో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ శ్రీలీల ఇంటర్వ్యూను నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రోమోను కొద్ది సేపటి క్రితమే విడుదల చేశారు. దీనికి తక్కువ సమయంలోనే భారీ స్పందన వస్తోంది.
ఇక, తాజాగా వచ్చిన ప్రోమోలో ముందుగా సుమ కనకాల దర్శకుడు బోయపాటి శ్రీను స్టైల్‌ను ఇమిటేట్ చేసింది. ఆ తర్వాత దీన్ని హీరో రామ్ కూడా చేసి చూపించి అందరినీ తెగ నవ్వించేశాడు. అనంతరం యాంకర్ సుమ శ్రీలీలతో 'నువ్వు చాలా అందంగా ఉన్నావు నాలాగే' అంది. దీంతో రామ్ 'నేను సినిమా ప్రమోషన్‌కు వచ్చాను.. నువ్వు నిన్ను ప్రమోట్ చేసుకోడానికి వచ్చావు' అని హీరోయిన్‌కు షాకిచ్చాడు.

దీని తర్వాత సుమ 'ఈ సినిమాలో ఫైట్స్ చింపేశారు అసలు' అని అంది. దీనికి రామ్ 'ఈ సినిమా వరకూ ప్రతి షాట్ తర్వాత ఉన్నానా? పోయానా? అని డౌట్ వచ్చేది' అన్నాడు. అనంతరం ట్రైలర్‌లో హీరో చెప్పినట్లు శ్రీలీలను చూస్తూ యాంకర్ సుమ 'ఏంటి నువ్వేమైనా ఫిగర్‌వా' అని డైలాగ్ వేసింది. దీంతో రామ్ 'నువ్వు పెద్ద ఫిగర్‌వి అనుకుంటున్నావా' అని షాకిచ్చాడు. ఆ తర్వాత సుమ 'పులి వేటకొచ్చింది' అని హీరో చెప్పిన డైలాగ్‌ను గుర్తు చేయగా.. రామ్ పోతినేని 'పులి వయసుకు వచ్చింది' అంటూ పంచ్ వేసి మరోసారి నవ్వించేశాడు.
ఇదంతా అయిపోయిన తర్వాత సుమ 'ఎందుకలా రామ్ మీద ప్రాంక్స్ చేస్తున్నావు' అని శ్రీలీలను ప్రశ్నించింది. దీనికామె 'మీరు కానివ్వండి.. మీరేదో ఫ్లోలో ఉన్నారు' అని బదులిచ్చింది. తర్వాత కూడా ఎన్నో పంచులు, సెటైర్లతో ఈ ప్రోమో సాగింది. ఇక, చివర్లో రామ్ పోతినేనిని యాంకర్ సుమ 'పెళ్లి ఎప్పుడు' అని ప్రశ్నించింది. ఇక్కడితో దీన్ని కట్ చేశారు. మొత్తానికి ఈ ప్రోమో ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది. ఈ ఫుల్ ఇంటర్వ్యూ వీడియో ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు విడుదల కానుంది.
ఇదిలా ఉండగా.. 'స్కంద' సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటించగా.. సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, ఇంద్రజ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











